Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ద్వాపర కాలం నాటి ఈ శివాలయం వెరీ వెరీ స్పెషల్.. నిల్చున్న నందీశ్వరుడు.. కోరిక చెవిలో చెబితే శివయ్యకు చేరవేస్తాడని నమ్మకం

నంది కొమ్ముల నుంచి శివయ్యను దర్శనం చేసుకోవడం మంచిది అని చాలా మంది నమ్మకం. నందీశ్వరుడు శంకరుని గొప్ప భక్తుడు. నంది శివుని వాహనం. ప్రతి శివాలయంలో తన గణాలలో నందితో పాటు శివునితో ఉంటాడని నమ్మకం. అయితే ఏ శివాలయంలోనైనా సరే నంది కూర్చుని ఉన్నట్లు ఉంటుంది. అయితే నందీశ్వరుడు నిల్చున్న నిలువెత్తు రూపంలో ఉన్న ఆలయం గురించి మీకు తెలుసా.. ఈ రోజు అటువంటి ఆలయం గురించి తెలుసుకుందాం..

ద్వాపర కాలం నాటి ఈ శివాలయం వెరీ వెరీ స్పెషల్.. నిల్చున్న నందీశ్వరుడు.. కోరిక చెవిలో చెబితే శివయ్యకు చేరవేస్తాడని నమ్మకం
Sandipani Ashram, Ujjain
Follow us
Surya Kala

|

Updated on: Jul 03, 2024 | 1:55 PM

శ్రావణ మాసం హిందువులకు పవిత్ర మాసం. ఉత్తరాధివారు ఈ నెలలో శివుడిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజ చేస్తారు. దక్షిణాది వారు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ దేవి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్దలతో చేస్తారు. ఇక శ్రావణ మాసంలో శివుడిని ఆరాధించడం ద్వారా ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. ఈ సమయంలో ఎక్కువ మంది శివుని ఆలయాలను సందర్శించడానికి కూడా వెళతారు. అటువంటి పరిస్థితిలో శివాలయంలో శివుడికి పూజను చేసే ముందు నందిశ్వరుడిని దర్శనం చేసుకుంటారు. నంది కొమ్ముల నుంచి శివయ్యను దర్శనం చేసుకోవడం మంచిది అని చాలా మంది నమ్మకం. అయితే ఏ శివాలయంలోనైనా సరే నంది కూర్చుని ఉన్నట్లు ఉంటుంది. అయితే నందీశ్వరుడు నిల్చున్న నిలువెత్తు రూపంలో ఉన్న ఆలయం గురించి మీకు తెలుసా.. ఈ రోజు అటువంటి ఆలయం గురించి తెలుసుకుందాం..

నందీశ్వరుడు శంకరుని గొప్ప భక్తుడు. నంది శివుని వాహనం. ప్రతి శివాలయంలో తన గణాలలో నందితో పాటు శివునితో ఉంటాడని నమ్మకం. అయితే ఓ శివాలయంలో ఉన్న నందీశ్వరుడు నిలువెత్తు విగ్రహం వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది.

ఈ ఆలయం ఎక్కడ ఉందంటే

ఈ శివాలయం ఉజ్జయిని మహకల్ నగరం అని పిలువబడే నగరంలో ఉంది. మహర్షి సాందీపుని ఆశ్రమం ఉజ్జయినిలో ఉంది. శ్రీకృష్ణుడు, అతని స్నేహితుడు సుదాముడు, సోదరుడు బలరాముడు కూడా విద్యను అభ్యసించిన ఆశ్రమం ఇదే. ఇక్కడే శ్రీ కృష్ణుడు 64 రోజులలో 16 కళలు, 64 శాస్త్రాల జ్ఞానాన్ని సంపాదించాడు. ఇక్కడ ఉన్న శివాలయాన్ని పిండేశ్వర మహాదేవ అని పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

నందీశ్వరుడు ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నాడంటే

పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుని బాల్య చేష్టలను చూడటానికి శివుడు మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. నందీశ్వరుడు, శివుడుతో పాటు వచ్చాడు. అయితే శివుడు.. ,బాల గోపలుడితో కలిసి వస్తున్న సమయంలో అక్కడ ఉన్న నందీశ్వరుడు వారిద్దరిని గౌరవిస్తున్నట్లు లేచి నిలబడ్డాడు. ఈ కారణంగానే ఇక్కడ ఉన్న శివాలయంలో నంది విగ్రహం నిలబడి ఉందని నమ్మకం. చారిత్రికుల నమ్మకం ప్రకారం ఈ శివాలయం ద్వాపర యుగంలో స్థాపించబడింది.

నందీశ్వరుడు విగ్రహం ప్రాముఖ్యత

శివాలయంలో నందీశ్వరుడు విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహాన్ని భక్తి, శక్తికి చిహ్నంగా భావిస్తారు. శివుని దూత అని కూడా చెబుతారు, అందుకే ఇక్కడి ప్రజలు తమ కోరికలను శివునికి తెలియజేయడానికి నందీశ్వరుడి చెవుల్లో గుసగుసలాడుతూ చెబుతారు. నందిని శివుని వాహనంగా భావించి అత్యంత భక్తీ శ్రద్దలతో పూజిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు