Health Care: వామ్మో..! వీటితో అంత ప్రమాదమా.. తరచూ ఉపయోగిస్తే అంతే సంగతులు..

శరీరానికి విటమిన్ల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం విటమిన్లు శరీరంలో ప్రధానమైనవిగా చెబుతారు వీటి వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందడం సాధ్యమవుతుంది. అయితే ఈ విటమిన్‎లు మంచి ఆహారం, న్యాచురల్‎గా ప్రకృతి నుండి శరీరానికి అందుతాయి. విటమినులు శరీరానికి సరిగ్గా అందకపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తూంటాయి. దీనికోసం వైద్యులు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్‎లను వాడమని సూచిస్తుంటారు.

Doctors Report
Follow us

| Edited By: Srikar T

Updated on: Jul 03, 2024 | 1:02 PM

శరీరానికి విటమిన్ల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం విటమిన్లు శరీరంలో ప్రధానమైనవిగా చెబుతారు వీటి వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందడం సాధ్యమవుతుంది. అయితే ఈ విటమిన్‎లు మంచి ఆహారం, న్యాచురల్‎గా ప్రకృతి నుండి శరీరానికి అందుతాయి. విటమినులు శరీరానికి సరిగ్గా అందకపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తూంటాయి. దీనికోసం వైద్యులు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్‎లను వాడమని సూచిస్తుంటారు.

అయితే ఈ మధ్య కాలంలో సరైన, సమయానికి ఆహారం శరీరానికి అందకపోవడంతో చాలా మంది మల్టీవిటమిన్‎ల వాడకాన్ని పెంచారు. అయితే అధికంగా మల్టీవిటమిన్‎లు వాడితే ఆరోగ్య సమస్యలు తగ్గడం కంటే కూడా త్వరగా మరణం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని తాజా సర్వే రిపోర్ట్‎లు చెబుతున్నాయి. అమెరికాకు సంబంధించిన నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు 1990 నుంచి 3 లక్షల మందిపై దాదాపు 20 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. ఎక్కువకాలం జీవించడానికి మల్టీ విటమిన్‎ల ఉపయోగం ఉండదని.. మరణించే ముప్పు ఏ మాత్రం తగ్గించడం లేదని పరిశోధకులు గుర్తించారు. పైగా మల్టీ విటమిన్లు తీసుకోని వారి కంటే.. మల్టీ విటమిన్ టాబ్లెట్లు వాడుతున్న వారిలో త్వరగా మరణించే ప్రమాదం నాలుగు శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.

అందుకోసం మల్టీ విటమిన్ తీసుకోవడం కంటే.. హెల్తీ ఆహారం తీసుకోవడం మంచిదని పరిశోధకులు చెప్తున్నారు. తీసుకునే ఆహారంలో సూక్ష్మ, అతి సూక్ష్మ పోషకాలు, పీచు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలంటున్నారు. కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువ ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. మల్టీ విటమిన్ తీసుకోవడం కంటే ఆహారంలో ఎక్కువగా కూరగాయలు, చిరుధాన్యాలు తీసుకోవడం మంచిదని చాలామంది వైద్యులు సలహాలు ఇస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం

మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!

నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?

యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!

గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..

విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!

జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..

సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!

అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.

సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు