Lung Health: ఈ ఫుడ్స్ తింటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయంట.. అవి ఏంటో తెలుసా..?

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. కావున ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలాముఖ్యం.. శరీరంలోని కీలక అవయవాల్లో ఊపిరితిత్తులు ఒకటి.. ఊపిరితిత్తులను జాగ్రత్తగా చూసుకోవడం చాలాముఖ్యం.. ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రధాన ప్రమాద కారకాలలో..

Lung Health: ఈ ఫుడ్స్ తింటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయంట.. అవి ఏంటో తెలుసా..?
Lung Health
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 03, 2024 | 12:34 PM

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. కావున ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలాముఖ్యం.. శరీరంలోని కీలక అవయవాల్లో ఊపిరితిత్తులు ఒకటి.. ఊపిరితిత్తులను జాగ్రత్తగా చూసుకోవడం చాలాముఖ్యం.. ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రధాన ప్రమాద కారకాలలో జలుబు, న్యుమోనియా, క్షయ, ఆస్తమా, క్యాన్సర్, శ్వాసలోపం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు మొదలైనవి ఉన్నాయి. మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా.. అస్తమా లాంటివి ఉంటే.. మీ ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నట్లు లెక్క. వాయు కాలుష్యం స్థాయిలు పెరుగుతున్న కొద్దీ, ఊపిరితిత్తుల ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది.

కాలుష్యం కూడా పెరుగుతోంది.. కావున ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.. అందులో ఆహారం ముఖ్యం పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తులను రక్షించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.

క్యాటెచిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న గ్రీన్ టీ రోజూ తాగితే ఊపిరితిత్తుల పనితీరు, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఊపిరితిత్తుల పనితీరుకు తోడ్పడే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బ్లూబెర్రీస్, క్రాన్ బెర్రీస్ వంటి బెర్రీలను తీసుకోవడం మంచిది.

శరీర వాపును తగ్గించడానికి, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి సాల్మన్ ఫిష్, వాల్‌నట్‌లు వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలను తినాలి.

ఇది కాకుండా పసుపు కూడా రెగ్యులర్ గా తీసుకోవాలి.. ఆహారంలో పసుపును తీసుకుంటే.. దాని ఇమ్యునోస్టిమ్యులెంట్, లక్షణాలు శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ కోసం బచ్చలికూర వంటి ఆకు కూరలను మీ ఆహారంలో పుష్కలంగా తినాలి..

బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు వంటి కూరగాయలను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది.

యాపిల్స్ కూడా తినవచ్చు.. యాపిల్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, బీటా కెరోటిన్, విటమిన్లు సి, ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తుల పనితీరు క్షీణతను మందగించడం ద్వారా COPD ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఇంకా దుంపలు, టమోటాలు, బీన్స్, అవిసె గింజలు లాంటివి కూడా ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..