మాడిన నాన్‌స్టిక్ పాన్‌ను శుభ్రం చేయాలంటే ఈ సింపుల్ టిప్స్ ట్రై చేసి చూడండి..

బేకింగ్ సోడా ఉపయోగించి మాడిపోయిన నాన్-స్టిక్ పాన్‌ను శుభ్రం చేయవచ్చు. ఇందు కోసం ముందుగా పాన్ పూర్తిగా చల్లబరచాలి. పాన్ ఎక్కడైతే మాడిపోయిందో అక్కడ బేకింగ్ సోడాను చల్లాలి. తర్వాత బేకింగ్ సోడాపై వేడి నీరుని పోయాలి. అనంతరం పాన్ ను కనీసం 30 నిమిషాలు నాననివ్వాలి. దీని తర్వాత బేకింగ్ సోడా తన మేజిక్ ను చేస్తుంది. నానబెట్టిన తర్వాత పాన్ ను స్పాంజ్ లేదా మృదువైన బ్రష్‌ను ఉపయోగించి మాడిన ప్రదేశాలను సున్నితంగా స్క్రబ్ చేయాలి.

మాడిన నాన్‌స్టిక్ పాన్‌ను శుభ్రం చేయాలంటే ఈ సింపుల్ టిప్స్ ట్రై చేసి చూడండి..
Kitchen Hacks
Follow us

|

Updated on: Jul 03, 2024 | 4:20 PM

ఒకొక్కసారి వంటలు చేస్తున్న సమయంలో మంట ఎక్కువై ఆహారం అడుగంటి గిన్నెలు మాడిపోతాయి. అప్పుడు పాన్ లేదా గిన్నెలు మురికిగా మారి శుభ్రం చేయడం కష్టంగా మారుతుంది. అయితే ఇలా మాడిపోయిన పాన్ ను శుభ్రం చేయడం కోసం చాలా కష్టపడతారు. అయినా శ్రమకు తగిన ఫలితం దక్కదు. దీంతో ఈ రోజు పాన్ ను శుభ్రం చేయడానికి సింపుల్ చిట్కాలు ఉన్నాయి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

మాడిన నాన్‌స్టిక్ పాన్‌ను బేకింగ్ సోడాతో శుభ్రం చేయడానికి చిట్కాలు

బేకింగ్ సోడా ఉపయోగించి మాడిపోయిన నాన్-స్టిక్ పాన్‌ను శుభ్రం చేయవచ్చు. ఇందు కోసం ముందుగా పాన్ పూర్తిగా చల్లబరచాలి. పాన్ ఎక్కడైతే మాడిపోయిందో అక్కడ బేకింగ్ సోడాను చల్లాలి. తర్వాత బేకింగ్ సోడాపై వేడి నీరుని పోయాలి. అనంతరం పాన్ ను కనీసం 30 నిమిషాలు నాననివ్వాలి. దీని తర్వాత బేకింగ్ సోడా తన మేజిక్ ను చేస్తుంది. నానబెట్టిన తర్వాత పాన్ ను స్పాంజ్ లేదా మృదువైన బ్రష్‌ను ఉపయోగించి మాడిన ప్రదేశాలను సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఈ సమయంలో నాన్-స్టిక్ పూత దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలి. మిగిలిన బేకింగ్ సోడాను.. మాడిన అవశేషాలను తొలగించడానికి ఉపయోగించి పాన్‌ను గోరువెచ్చని నీటితో బాగా కడగాలి. అవసరమైతే ఇలా మళ్ళీ చేయండి. అప్పుడు ఎటువంటి కఠినమైన మరకలు అయినా సరే పోతాయి. పాన్ ను శుభ్రం చేసిన తర్వాత పాన్‌ని నిల్వ చేయడానికి లేదా మళ్లీ ఉపయోగించే ముందు శుభ్రమైన టవల్‌తో తుడిచి పూర్తిగా ఆరబెట్టండి.

ఇవి కూడా చదవండి

మాడిన నాన్-స్టిక్ పాన్‌ను డిష్‌వాషర్ టాబ్లెట్‌తో శుభ్రం చేయడానికి చిట్కా

డిష్‌వాషర్ టాబ్లెట్‌ని ఉపయోగించి నాన్-స్టిక్ పాన్‌ను శుభ్రం చేయవచ్చు. ముందుగా పాన్‌ను నీటితో నింపండి. ఎంతగా అంటే పాన్‌లో మాడిన ప్రాంతం కవర్ చేసే విధంగా సరిపడా నీటితో పాన్ ను నింపండి. ఇప్పుడు డిష్‌వాషర్ టాబ్లెట్‌ను జోడించండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ ఉంచి నీటిని మరిగించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చసి అలా ఒక గంట పాటు వదిలెయ్యండి. ఇప్పుడు చాలా సున్నితంగా స్క్రబ్ చేయండి. ఇలా మాడిన ప్రదేశాలను స్క్రబ్ చేయడానికి స్పాంజ్ లేదా మృదువైన బ్రష్‌ను ఉపయోగించండి. పూర్తిగా శుభ్రం అయ్యాక పాన్‌ను గోరువెచ్చని నీటితో బాగా కడగాలి.తర్వాత పాన్ ను పూర్తిగా ఆరబెట్టండి. శుభ్రం చేసిన తర్వాత, పాన్‌ని నిల్వ చేయడానికి లేదా మళ్లీ ఉపయోగించే ముందు శుభ్రమైన టవల్‌తో తుడిచి పూర్తిగా ఆరబెట్టండి. ఈ పద్ధతి నాన్-స్టిక్ ప్యాన్‌ల నుండి కాలిన ఆహార అవశేషాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. దీంతో నాన్-స్టిక్ పాన్‌లను శుభ్రం చేయడం సులభం అవుతుంది.

ఉడకబెట్టిన నిమ్మకాయలను ఉపయోగించి మాడిన నాన్-స్టిక్ పాన్‌ను ఎలా శుభ్రం చేయవచ్చంటే

నిమ్మకాయలను ముక్కలుగా కోసి మాడిన పాన్‌లో వేసి నీటితో నింపి స్టవ్‌పై పెట్టి ఆ నీటిని మరిగించాలి. ఈ నిమ్మకాయ నీటి మిశ్రమాన్ని సుమారు 15-20 నిమిషాలు ఉంచండి. పాన్ చల్లారిన తర్వాత స్పాంజి లేదా మృదువైన బ్రష్ ఉపయోగించి పాన్ లో మాడిన ప్రాంతాలపై సున్నితంగా స్క్రబ్ చేయండి. మిగిలిన అవశేషాలను తొలగించి పాన్‌ను గోరువెచ్చని నీటితో బాగా కడగాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు