Diabetes: ఆహార విషయంలో ఈ తప్పులు చేస్తే షుగర్‌‌ని అస్సలు కంట్రోల్ చేయలేం!

ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధితో బాధ పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ దీని బారిన పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం మీరు తీసుకునే ఆహారం. ఈ విషయం అటు ఉంచితే.. డయాబెటీస్ వచ్చిన వాళ్లు కూడా ఆహారం విషయంలో చాలా రకాల తప్పులు చేస్తున్నారు. దీంతో షుగర్ లెవల్స్ అనేవి మరింత పెరిగి.. ప్రాణాల మీదకు వస్తుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు తినే విషయంలో..

Diabetes: ఆహార విషయంలో ఈ తప్పులు చేస్తే షుగర్‌‌ని అస్సలు కంట్రోల్ చేయలేం!
Diabetes
Follow us

|

Updated on: Jul 03, 2024 | 3:46 PM

ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధితో బాధ పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ దీని బారిన పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం మీరు తీసుకునే ఆహారం. ఈ విషయం అటు ఉంచితే.. డయాబెటీస్ వచ్చిన వాళ్లు కూడా ఆహారం విషయంలో చాలా రకాల తప్పులు చేస్తున్నారు. దీంతో షుగర్ లెవల్స్ అనేవి మరింత పెరిగి.. ప్రాణాల మీదకు వస్తుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు తినే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల తప్పులు చేయడం వల్ల డయాబెటిస్ వ్యాధి తీవ్రతరం అవుతుంది. షుగర్ వచ్చిన వాళ్లు ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. దీంతో ఏదైనా తినేయవచ్చు కదా అని ఏవి పడితే అవి తినేస్తూ ఉంటారు. దీంతో డయాబెటీస్ అనేది కంట్రోల్ అవ్వగుండా.. మరింత పెరుగుతుంది. షుగర్ ఉన్నవారు ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఈ తప్పులు అస్సలు చేయకూడదు.

కూల్ డ్రింక్స్ తాగకూడదు:

డయాబెటీస్ వచ్చిన వాళ్లు కూడా ఏం కాదులే అని కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఈ కూల్ డ్రింక్స్‌లో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో షుగర లెవల్స్ అనేవి బాగా పెరిగిపోతాయి. ఆ తర్వాత మళ్లీ కంట్రోల్ చేయడం చాలా కష్టం.

స్వీట్స్:

షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం కదా.. అని చాలా మంది స్వీట్స్ కూడా తినేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల షుగర్ లెవల్స్ అనేవి మరింత పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

జంక్:

డయాబెటీస్ ఉన్నవారు జంక్ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకుంటారు. ఇలా తినడం వల్ల వారి ప్రాణాల మీదకు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. జంక్ ఫుడ్ వల్ల కూడా షుగర్ అనేది బాగా పెరుగు పోతుంది.

ఒకేసారి తినకూడదు:

చాలా మంది ఒకేసారి ఎక్కువగా తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల కూడా షుగర్ లెవల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. భోజనం లేదా పండ్లు ఇలా ఏవైనా ఒకటే సారి తినకూడదు. అలా తింటే.. రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కటే సారి పెరిగి.. ప్రాణాల మీదకు వస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు