Young Looking: ఎప్పుడూ యవ్వనంగా మెరిసిపోవాలి అనుకుంటున్నారా.. ఇవి తినండి!

అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఈ రోజుల్లో అందానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ అందం అంటే పైపై మెరుగులు కాదు. లోపలి నుంచి అందంగా కనిపించడం ముఖ్యం. శరీరం లోపలి నుంచి అందంగా ఉంటానే మీరు ఎక్కువ రోజులు అందంగా కనిపించగలరు. సాధారణంగా వయసు పై బడే కొద్దీ చర్మంపై ముడతలు, మచ్చలు, సన్నని గీతలు వంటివి కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణం శరీరంలో కొల్లాజెన్..

Young Looking: ఎప్పుడూ యవ్వనంగా మెరిసిపోవాలి అనుకుంటున్నారా.. ఇవి తినండి!
Young Looking
Follow us

|

Updated on: Jul 03, 2024 | 3:27 PM

అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఈ రోజుల్లో అందానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ అందం అంటే పైపై మెరుగులు కాదు. లోపలి నుంచి అందంగా కనిపించడం ముఖ్యం. శరీరం లోపలి నుంచి అందంగా ఉంటానే మీరు ఎక్కువ రోజులు అందంగా కనిపించగలరు. సాధారణంగా వయసు పై బడే కొద్దీ చర్మంపై ముడతలు, మచ్చలు, సన్నని గీతలు వంటివి కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణం శరీరంలో కొల్లాజెన్ తగ్గడమే. కొల్లాజెన్ అనేది చర్మానికి, కండరాలకు, ఎముకలకు చాలా ముఖ్యం. కొల్లాజెన్ ఎక్కువగా ఉంటేనే.. అందంగా కనిపిస్తారు. సాధారణంగా 25 సంవత్సరాలు దాటాక.. శరీరంలో కొల్లాజెన్ లెవల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. దీని వల్ల మీ ముఖంలో కొద్ది కొద్దిగా మార్పులు కనిపిస్తూ ఉంటాయి. కానీ మీరు సరైన ఆహారం తీసుకుంటే మాత్రం.. మీ వయసు కనిపించకుండా.. ఎప్పుడూ యంగ్‌గా కనిపిస్తారు. అందు కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

బెర్రీలు:

బెర్రీల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిల్లో పోషకాలు అనేవి సమృద్ధిగా లభ్యమవుతాయి. ముఖ్యంగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తికి బాగా సహాయ పడతాయి. మీరు యంగ్ లుకింగ్‌తో కనిపించాలి అనుకుంటే.. ప్రతి రోజూ ఒక కప్పు బెర్రీలు తినడం చాలా మంచిది. బెర్రీల్లో ఏదైనా తినవచ్చు.

చేపలు:

కొవ్వు ఉన్న చేపలు తినడం వల్ల కూడా శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి అనేది పెరుగుతుంది. వీటిని తినడం వల్ల చర్మం, జుట్టు, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ముడతలు అనేవి అస్సలు పడకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

గుడ్డు:

గుడ్డు అనేది సంపూర్ణ ఆహారం. అంతే కాకుండా ఇందులో కొల్లాజెన్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ మీ డైట్‌లో గుడ్డును యాడ్ చేసుకుని తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.

చికెన్:

చికెన్ తినడం వల్ల కూడా యంగ్ లుక్ ని సొంతం చేసుకోవచ్చు. చికెన్ తింటే ముఖంపై ఉండే గీతలు, ముడతలు అనేవి చాలా వరకూ తగ్గుతాయి. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

ఆకుకూరలు:

ఆకు కూరలు తినడం వల్ల కూడా మీరు యంగ్ లుక్‌ని సొంతం చేసుకోవచ్చు. వీటి వల్ల ఆరోగ్యంతో పాటు శరీరంలో కొల్లాజెన్‌ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా కొత్తిమీర తింటే మరింత అందంగా కనిపిస్తారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు