CM Babu Delhi Tour: ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులతో కీలక చర్చలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ టూర్‌లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలు ప్రధానితో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీకి ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధానికి వివరించినట్లుగా సమాచారం. బడ్జెట్‌లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది.

CM Babu Delhi Tour: ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులతో కీలక చర్చలు
Chandrababu With Modi
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 04, 2024 | 4:20 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ టూర్‌లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలు ప్రధానితో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీకి ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధానికి వివరించినట్లుగా సమాచారం. బడ్జెట్‌లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది.

అంతకుముందు రాష్ట్రానికి చెందిన ఎన్డీయే ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను చంద్రబాబు కలిశారు. ఆయనతో వివిధ అంశాలపై మాట్లాడారు. ఇక మధ్యాహ్నం కేంద్రమంత్రులు అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో సీఎం భేటీ అవుతారు. ఏపీలో హైవేల విస్తరణ, ఇతర అంశాలపై గడ్కరీతో చర్చించారు. అనంతపురం అమరావతి రహదారి, హైదరాబాద్‌-అమరావతి హైవేపై చర్చలు జరిపారు. వాణిజ్య పన్నులశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తోనూ సుధీర్ఘ చర్చలు జరిపారు. సాయంత్రం కేంద్రమంత్రులు మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, హర్దీప్‌ సింగ్‌ పురీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇక రేపు నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..