Anant Ambani, Radhika Merchant Wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుక.. మామేరు ఫంక్షన్‏లో అమ్మ నగలతో అందంగా రాధికా..

ఈ వేడుకలలో రాధిక మర్చంట్ ఎంబ్రాయిడరీ లెహంగాలో మరింత అద్భుతంగా కనిపించింది. ఆరెంజ్ అండ్ పింక్ షేడ్స్ తో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహంగాలో అందంగా ముస్తాబైంది. బంగారు నెక్లెస్, మ్యాచింగ్ జుంకాలు, బ్యాంగిల్స్, ఇంకా స్పెషల్ హెయిర్ స్టైల్ తో రాధిక లుక్ అదిరింది. ఈ వేడుకకు తన తల్లి ఆభరణాలను ధరించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది రాధిక.

Anant Ambani, Radhika Merchant Wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుక.. మామేరు ఫంక్షన్‏లో అమ్మ నగలతో అందంగా రాధికా..
Ananth Ambani, Radika March
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 04, 2024 | 1:41 PM

రియన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. తన చిరకాల ప్రేయసి రాధిక మర్చంట్‏ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. వివాహ వేడుకకు సంబంధించిన కీలక ఘట్టాలను ఒక్కొక్కటిగా నిర్వహిస్తుంది అంబానీ కుటుంబం. ముఖ్యంగా గుజరాతీ వివాహాల్లో మొదటిగా నిర్వహించే అచారాలను ఇరు కుటుంబాలు పాటిస్తుంది. ఈ క్రమంలోనే ముంబైలోని యాంటిలియోలో మామేరు వేడుకలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ గుజరాతి సంప్రదాయం ప్రకారం కాబోయే కొడలికి అత్త మామలు స్విట్లు, బహుమతులు అందించారు. ఈ మామేరు వేడుక వధువు, వరుడు ఇంట్లో వేరు వేరుగా జరుగుతుంది.

వరుడిప వైపు నుంచి నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, ఆమె సోదరి మమతా దలాల్, ఇతర సన్నిహిత బంధువులు వధువును ఆశీర్వదించారు. పనేటర్ చీర, ఆభరణాలు, బ్యాంగిల్స్, స్వీట్స్, డ్రైఫ్రూట్స్ వంటి వాటిని వధువుకు బహుమతిగా అందించారు. ఈ వేడుకలలో రాధిక మర్చంట్ ఎంబ్రాయిడరీ లెహంగాలో మరింత అద్భుతంగా కనిపించింది. ఆరెంజ్ అండ్ పింక్ షేడ్స్ తో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహంగాలో అందంగా ముస్తాబైంది. బంగారు నెక్లెస్, మ్యాచింగ్ జుంకాలు, బ్యాంగిల్స్, ఇంకా స్పెషల్ హెయిర్ స్టైల్ తో రాధిక లుక్ అదిరింది. ఈ వేడుకకు తన తల్లి ఆభరణాలను ధరించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది రాధిక.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుక జూలై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‏లో జరగనుంది. ఈ వేడుకలలో వారణాసిలోని ప్రసిద్ధ కాశీ చాట్ భండార్ నుంచి ఒక చాట్ స్టాల్ కూడా అతిథుల కోసం ఏర్పాటు చేయనున్నారు. హిందూ వైదిక ఆచారాలకు కట్టుబడి అనంత్, రాధిక వివాహ వేడుకలను నిర్వహించనున్నారు. జూలై 12న వివాహం కాగా.. జూలై 13న శుభ ఆశీర్వాదం వేడుకలు నిర్వహిస్తారు. అలాగే జూలై 14న మంగళ్ ఉత్సవ్ (రిసెప్షన్) నిర్వహించనున్నారు. తమ వివాహ వేడుకలలో భాగంగా జూలై 2న పాల్ఘర్ లోని స్వామి వివేకానంద్ విద్యామందిర్ లో నిరుపేదలకు ముకేశ్ అంబానీ, నీతా అంబానీలు సామూహిక వివాహాలు జరిపించిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.