AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikanth OTT: ఇట్స్ అఫీషియల్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి IMDB టాప్ రేటింగ్ మూవీ.. ఎందులో చూడొచ్చంటే?

దృష్టి లోపం కారణంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తన కలల్ని సాకారం చేసుకున్న శ్రీకాంత్ బొల్లా పాత్రలో రాజ్ కుమార్ రావ్ నటించాడనే బదులు జీవించాడనే చెప్పుకోవచ్చు. రేటింగ్‌ పరంగా కూడా ఈ సినిమాకు భారీగా రెస్పాన్స్‌ వచ్చింది. IMDb 7.9 రేటింగ్‌తో ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్‌ చేసింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లను సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది

Srikanth OTT: ఇట్స్ అఫీషియల్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి IMDB టాప్ రేటింగ్ మూవీ.. ఎందులో చూడొచ్చంటే?
Srikanth Movie
Basha Shek
|

Updated on: Jul 04, 2024 | 3:36 PM

Share

బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ నటించిన సినిమా శ్రీకాంత్. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు శ్రీకాంత్‌ బొల్లా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తుషార్ హీరానందానీ తెరకెక్కించిన ఈ బయోపిక్ లో సీనియర్ నటి జ్యోతిక, అలయా ఎఫ్, శరద్ కేల్కర్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. సుమారు రెండు నెలల క్రితం థియేటర్లలో ( మే10) రిలీజైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా దృష్టి లోపం కారణంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తన కలల్ని సాకారం చేసుకున్న శ్రీకాంత్ బొల్లా పాత్రలో రాజ్ కుమార్ రావ్ నటించాడనే బదులు జీవించాడనే చెప్పుకోవచ్చు. రేటింగ్‌ పరంగా కూడా ఈ సినిమాకు భారీగా రెస్పాన్స్‌ వచ్చింది. IMDb 7.9 రేటింగ్‌తో ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్‌ చేసింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లను సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. శ్రీకాంత్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (జులై 5) నుంచి ఈ బయోపిక్ స్ట్రీమింగ్ కానుంది. అంటే మరికొన్ని గంటల్లోనే శ్రీకాంత్ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. ఈ విషయాన్ని నెట్‌ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

భూషణ్‌ కుమార్‌, నిధి పర్మార్‌ సంయుక్తంగా శ్రీకాంత్ నిర్మించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు శ్రీకాంత్‌ బొల్లా జీవిత కథను కళ్లకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించారు. మచిలీపట్నం దగ్గర సీతారామపురంలో పుట్టి పెరిగిన శ్రీకాంత్ చిన్నప్పుడే కంటిచూపు కోల్పోయారు. స్కూల్ డేస్ నుంచి అవమానాలను ఎదుర్కొన్న శ్రీకాంత్ అమెరికాలోని MIT నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా చరిత్రకెక్కాడు. తన చదువుకు తగ్గట్టుగా అమెరికా లాంటి అగ్ర దేశాల్లో ఉద్యోగవకాశం వచ్చినా తన సొంత గడ్డపైనే ఆవిష్కరణలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 2012లో శ్రీకాంత్ పర్యావరణహిత వస్తువులు తయారు చేసే బొల్లాంట్ ఇండస్ట్రీస్ స్థాపించారు. థియేటర్లలో శ్రీకాంత్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కార్తీక మాసంలో ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే..!
కార్తీక మాసంలో ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే..!
రోహిత్ ఎలిమినేషన్ ట్విస్ట్: సీక్రెట్ రూమ్ ఆఫర్ రిజెక్ట్..
రోహిత్ ఎలిమినేషన్ ట్విస్ట్: సీక్రెట్ రూమ్ ఆఫర్ రిజెక్ట్..
చెల్లెలిని ప్రేమించాడని యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన అన్న..
చెల్లెలిని ప్రేమించాడని యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన అన్న..
కేవలం రూ.400కే వాటర్ ట్యాంకర్.. హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్
కేవలం రూ.400కే వాటర్ ట్యాంకర్.. హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్
చికెన్‌తో మస్త్ కాంబినేషన్ ఈ చారు.. దెబ్బకు జలుబు, దగ్గు మటాష్
చికెన్‌తో మస్త్ కాంబినేషన్ ఈ చారు.. దెబ్బకు జలుబు, దగ్గు మటాష్
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే బీట్రూట్ పల్లీల చట్నీ..
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే బీట్రూట్ పల్లీల చట్నీ..
ప్లాస్టిక్ సంచిలో బాలుడు, బాలిక బొమ్మలు.. శ్మశానవాటికలో కలకలం!
ప్లాస్టిక్ సంచిలో బాలుడు, బాలిక బొమ్మలు.. శ్మశానవాటికలో కలకలం!
దిగ్బల యోగంతో వీరికి ఉద్యోగంలో గోల్డెన్ డేస్..!
దిగ్బల యోగంతో వీరికి ఉద్యోగంలో గోల్డెన్ డేస్..!
శివ ఫస్ట్ డే షూటింగ్‏లో ఆర్జీవీ చెప్పిన మాటకు గుండె కొట్టుకుంది.
శివ ఫస్ట్ డే షూటింగ్‏లో ఆర్జీవీ చెప్పిన మాటకు గుండె కొట్టుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఢమాల్.. నేటి రేట్లు ఇవే..