Tollywood: పోలికలు చూసి ఈ పిల్లాడు ఎవరో చెప్పగలరా? టాలీవుడ్‌లో మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్.. డైరెక్టర్ కమ్ హీరో

పై ఫొటోలో సూటు, బూటు వేసుకుని స్టైలిష్ గా పోజులిస్తోన్న ఈ పిల్లాడు ఎవరో చెప్పగలరా? పోలికలు చూసి గుర్తు పట్టవచ్చు. ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్. అంటే కేవలం హీరోగానే కాదు.. రైటర్ గానూ, డైరెక్టర్ గానూ సత్తా చాటుతున్నాడు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో క్యామియో రోల్స్ పోషించిన అతను తన ట్యాలెంట్ తో మొదట డైరెక్టర్ గా మారాడు.

Tollywood: పోలికలు చూసి ఈ పిల్లాడు ఎవరో చెప్పగలరా? టాలీవుడ్‌లో మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్.. డైరెక్టర్ కమ్ హీరో
Tollywood Actor Childhood Photo
Follow us
Basha Shek

|

Updated on: Jul 02, 2024 | 7:39 PM

పై ఫొటోలో సూటు, బూటు వేసుకుని స్టైలిష్ గా పోజులిస్తోన్న ఈ పిల్లాడు ఎవరో చెప్పగలరా? పోలికలు చూసి గుర్తు పట్టవచ్చు. ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్. అంటే కేవలం హీరోగానే కాదు.. రైటర్ గానూ, డైరెక్టర్ గానూ సత్తా చాటుతున్నాడు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో క్యామియో రోల్స్ పోషించిన అతను తన ట్యాలెంట్ తో మొదట డైరెక్టర్ గా మారాడు. ఆ తర్వాత హీరోగా అదృష్టం పరీక్షించుకుని సక్సెస్ అయ్యాడు. టాలీవుడ్ లో డిఫరెంట్ స్టోరీస్ తో సినిమాలు తీసే హీరోల్లో ఇతను కూడా ఒకడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న ఈ యాక్టర్ ను గుర్తు పట్టారా? మరి . కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుదాం లెండి. అతను మరెవరో కాదు టాలీవుడ్ డైరెక్టర్ కమ్ హీరో అడివి శేష్. ఇది అతని చిన్నప్పటి ఫొటో. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అయినా ఎంతో స్టైలిష్ గా కనిపించే అడివి శేష్ చిన్నప్పుడు కూడా ఎంతో క్యూట్ గా కనిపిస్తున్నాడంటూ ఈ ఫొటోను చూసిన వారందరూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా కెరీర్ ప్రారంభంలో సొంతం, కర్మ, పంజా, బలుపు, కిస్, రన్ రాజా రన్, లేడీస్ అండ్ జెంటిల్ మెన్, బాహుబలి, దొంగాట, సైజ్ జీరో తదితర సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్, క్యామియో పాత్రలు చేశాడు అడివి శేష్. ఆ తర్వాత క్షణం సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత గూఢచారి, హిట్‌ 2, ఎవరు? మేజర్‌.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శేష్ గూఢచారి 2, డెకాయిట్ తదితర సినిమాలతో బిజిబిజీగా ఉంటున్నాడు.

ఇవి కూడా చదవండి

డెకాయిట్ సినిమాలో అడివి శేష్, శ్రుతి హాసన్..

కాగా డెకాయిట్‌లో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేసిన షానీల్‌ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు

గూఢచారి సినిమాలో అడివి శేష్ లుక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.