AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Kapoor: ఒక్క వీడియోకి మిలియన్ లైకులు, భారీ వ్యూస్.. ప్రభాస్ హీరోయిన్ క్రేజ్ మాములుగా లేదుగా..

బాలీవుడ్ లో మాత్రం బిజీగా మారిపోయింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది శ్రద్ధా కపూర్. సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా శ్రద్ధా కపూర్ కు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రద్ధా కొద్ది గంటల క్రితం ఒక వీడియోను పోస్ట్ చేసింది.

Shraddha Kapoor: ఒక్క వీడియోకి మిలియన్ లైకులు, భారీ వ్యూస్.. ప్రభాస్ హీరోయిన్ క్రేజ్ మాములుగా లేదుగా..
Shraddha Kapoor
Rajeev Rayala
|

Updated on: Jul 03, 2024 | 10:44 AM

Share

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాలో నటించింది ఈ చిన్నది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది శ్రద్ధా కపూర్. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు శ్రద్ధా కపూర్. బాలీవుడ్ లో మాత్రం బిజీగా మారిపోయింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది శ్రద్ధా కపూర్. సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా శ్రద్ధా కపూర్ కు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రద్ధా కొద్ది గంటల క్రితం ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన వీడియోను ఇప్పటివరకు 8 మిలియన్ల మంది వీక్షించారు.

ప్రస్తుతం, శ్రద్ధా వీడియో వైరల్ అవ్వడంతో పాటు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో శ్రద్ధా చాలా సంతోషంగా కనిపించింది. ఒక వీడియోను పోస్ట్ చేస్తూ, నటి 2024లో తాను ఇప్పటివరకు చేసిన వాటిని చూపించింది. వీడియోను పోస్ట్ చేస్తూ.. శ్రద్ధా.. ‘2024 సగం పూర్తయింది, ఈ సంవత్సరం ఇప్పటివరకు మీరు ఏమి చేశారో చెప్పండి.?’ అంటూ రాసుకొచ్చింది. శ్రద్ధా పోస్ట్‌పై అభిమానులు కూడా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటేశ్రద్ధా తన వ్యక్తిగత జీవితం కారణంగా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. గత కొన్ని రోజులుగా రాహుల్ మోడీతో శ్రద్ధా ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది మాత్రమే కాదు, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్‌కు కూడా శ్రద్ధ , రాహుల్ కలిసి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరి అనుబంధం గురించి చర్చ ఊపందుకుంది. ఇక శ్రద్ధ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది.? ఈ అమ్మడు ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.. శ్రద్ధా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈబ్యూటీ తన అభిమానులతో టచ్‌లో ఉండటానికి ఎప్పుడూ తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. నటి పోస్ట్‌లపై అభిమానులు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే