AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Mokshagna: ‘వచ్చేస్తున్నా’.. అరంగేట్రానికి బాలయ్య కుమారుడు రెడీ.. అదిరిపోయిన మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్

ఎప్పటి నుంచో బాలయ్య కుమారుడు సినిమాల్లోకి వస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. నందమూరి అభిమానులు కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెర పడనుంది. మోక్షజ్ఞ ఎంట్రీకీ రంగం సిద్ధమైందని తెలుస్తోంది.

Nandamuri Mokshagna: 'వచ్చేస్తున్నా'.. అరంగేట్రానికి బాలయ్య కుమారుడు రెడీ.. అదిరిపోయిన మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్
Nandamuri Mokshagna
Basha Shek
|

Updated on: Jul 01, 2024 | 7:42 PM

Share

నందమూరి అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఈ ఇంటి నుంచి మరో వారసుడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు. అతను మరెవరో కాదు నందమూరి నట సింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ. ఎప్పటి నుంచో బాలయ్య కుమారుడు సినిమాల్లోకి వస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. నందమూరి అభిమానులు కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెర పడనుంది. మోక్షజ్ఞ ఎంట్రీకీ రంగం సిద్ధమైందని తెలుస్తోంది. డెబ్యూ మూవీ గురించి ఇంకా క్లియర్ అప్ డేట్ రాలేదు కానీ మోక్షజ్ఞ కు సంబంధించిన కొన్ని కొత్త ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. గతంలో కొంచెం బొద్దుగా ఉన్న అతను ఇప్పుడు ఎంతో నాజుకుగా, స్టైలిష్ గా మారిపోయాడు. ఇలా స్లిమ్ గా, హ్యాండ్సమ్ గా ఉన్న ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన మోక్షజ్ఞ ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని రాసుకొచ్చాడు.

ప్రస్తుతం మోక్షజ్ఞ ఫొటోలు, ట్వీట్ నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. బాలయ్య కుమారుడి ఎంట్రీ ఖాయమైందంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. త్వరలోనే మోక్షజ్ఞ సినిమా అరంగేట్రం ఉంటుందని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు బాలయ్య. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. అయితే బాలయ్య కుమారుడు డెబ్యూ మూవీ ఏ డైరెక్టర్ తో చేయనున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. బోయపాటి శీను పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా ఇంకా ఫైనలైజ్ కాలేదు. అయితే మోక్షజ్ఞ సినిమాకు బాలయ్యే నిర్మాతగా వ్యవహరించబోతున్నారని సమాచారం. త్వరలోనే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి మరింత క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

నందమూరి  మోక్షజ్ఞ ట్వీట్.. ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!