Rohit Sharma: టీ20లకు గుడ్‌బై చెప్పేసిన రోహిత్ ఐపీఎల్ ఆడతాడా? లేదా? హిట్ మ్యాన్ సమాధానం ఇదే
ప్రపంచకప్‌లో టీమిండియా విజయంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. అయితే అంతలోనే విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ T20I క్రికెట్ నుండి రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం ద్వారా క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చారు. దీంతో తమ అభిమాన ఆటగాళ్లు ఇద్దరూ T20I క్రికెట్‌లో మళ్లీ కనిపించరని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
రోహిత్ శర్మ సారథ్యంలో 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. భారత క్రికెట్ జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 169 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో రోహిత్ శర్మ రెండు రికార్డులను బద్దలు కొట్టాడు. టీమిండియా నుంచి రెండు ప్రపంచకప్‌లు గెలిచిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ సారథ్యంలో టీమ్ ఇండియాకు ఇది 50వ టీ20 విజయం. ప్రపంచకప్‌లో టీమిండియా విజయంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. అయితే అంతలోనే విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ T20I క్రికెట్ నుండి రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం ద్వారా క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చారు. దీంతో తమ అభిమాన ఆటగాళ్లు ఇద్దరూ T20I క్రికెట్‌లో మళ్లీ కనిపించరని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిద్దరూ వరల్డ్ కప్ విజయంతో వీడ్కోలు పలకడంతో అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టీ20ల నుంచి రిటైరైనప్పటికీ వన్డే, టెస్టు క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని రోహిత్ స్పష్టం చేశాడు. అయితే టీ20 నుంచి రిటైర్మెంట్ తీసుకున్న రోహిత్ ఐపీఎల్‌లో ఆడుతాడా లేదా? క్రికెట్ అభిమానులకు వేధిస్తోన్న ప్రశ్న ఇది. రోహిత్ ఐపీఎల్‌లో ఆడుతాడా లేదా? ఈ ప్రశ్నకు హిట్‌మ్యాన్ స్వయంగా సమాధానమిచ్చాడు. అలాగే రోహిత్ రిటైర్మెంట్ కోరుకోవడం లేదని, అయితే పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని పేర్కొన్నాడు. ‘టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. అయితే ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే టీ20 ప్రపంచకప్‌కు వీడ్కోలు పలికేందుకు ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదు. అలాగే 100 శాతం ఐపీఎల్‌లో ఆడతాను’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
It’s your Captain Rohit Sharma signing off from T20Is after the #T20WorldCup triumph! 🏆
He retires from the T20I cricket on a very special note! 🙌 🙌
Thank you, Captain! 🫡#TeamIndia | @ImRo45 pic.twitter.com/NF0tJB6kO1
— BCCI (@BCCI) June 29, 2024
Dear @ImRo45,
You are excellence personified. Your aggressive mindset, batting and captaincy has given a new dimension to the Indian team. Your T20 career will be remembered fondly. Delighted to have spoken to you earlier today. pic.twitter.com/D5Ue9jHaad
— Narendra Modi (@narendramodi) June 30, 2024
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..