Kalki 2898 AD: ‘మా బావ ప్రభాస్‌కు అభినందనలు’.. కల్కి సినిమాను వీక్షించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు

బ్లాక్ బస్టర్ టాక్ తో ఇప్పటికే రికార్డులు దున్నేస్తోన్న ఈ సినిమాను పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు వీక్షిస్తున్నారు. అనంతరం సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అలాగే కల్కి చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కల్కి సినిమాను వీక్షించారు. అనంతరం ట్విట్టర్ వేదికగా కల్కి సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Kalki 2898 AD: 'మా బావ ప్రభాస్‌కు అభినందనలు'.. కల్కి సినిమాను వీక్షించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు
Prabhas, Mohan Babu
Follow us
Basha Shek

|

Updated on: Jun 29, 2024 | 8:50 PM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ . అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ తో ఇప్పటికే రికార్డులు దున్నేస్తోన్న ఈ సినిమాను పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు వీక్షిస్తున్నారు. అనంతరం సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అలాగే కల్కి చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కల్కి సినిమాను వీక్షించారు. అనంతరం ట్విట్టర్ వేదికగా కల్కి సినిమాపై తన అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. ‘ఈ రోజే ‘కల్కి’ సినిమా చూశాను. అద్భుతం.. మహాద్భుతం! మా బావ ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌కు, నిర్మాతకు, దర్శకుడికి నా అభినందనలు. తెలుగు సినీ పరిశ్రమ, భారతదేశం గర్వించదగ్గ సినిమాని అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నాను’ అని పోస్ట్ చేశారు మోహన్ బాబు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

కాగా ప్రభాస్, మోహన్ బాబులు కలిసి బుజ్జిగాడు సినిమాలో నటించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ప్రభాస్ ను ప్రేమగా ‘బావ’ అని పిలిచారు మోహన్ బాబు. ఇక మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న కన్నప్పలో ప్రభాస్ నటిస్తున్నాడు. మెహన్ బాబే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో దీనికి మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక కల్కి సినిమా విషయానికి వస్తే రెండు రోజుల్లోనే దాదాపు రూ. 190 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇక శని, ఆదివారాలు కావడంతో ఈ వసూళ్ల మోతాదు మరింత పెరగ వచ్చు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మారెమ్మ దేవరకు మొక్కు.. రికార్డు సృష్టించిన పొట్టేలు!
మారెమ్మ దేవరకు మొక్కు.. రికార్డు సృష్టించిన పొట్టేలు!
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!