- Telugu News Photo Gallery Cinema photos Actress Chandrika Gera Dixit selling Vadapav in Delhi street roads now enters in to Bigg Boss OTT3
ఢిల్లీ రోడ్లపై వడాపావ్ అమ్ముతూ రోజుకు 40వేలు సంపాదిస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ.. ఫొటోస్ చూశారా?
బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 గ్రాండ్ గా ప్రారంభమైంది. అయితే ఈసారి సల్మాన్ ఖాన్ బదులు అనిల్ కపూర్ షోను హోస్ట్ చేయనున్నారు. హిందీ బిగ్ బాస్ ఓటీటీ మూడో సీజన్ లో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌజ్ లోకి అడుగుపెట్టారు.
Updated on: Jun 27, 2024 | 7:36 PM

బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 గ్రాండ్ గా ప్రారంభమైంది. అయితే ఈసారి సల్మాన్ ఖాన్ బదులు అనిల్ కపూర్ షోను హోస్ట్ చేయనున్నారు. హిందీ బిగ్ బాస్ ఓటీటీ మూడో సీజన్ లో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌజ్ లోకి అడుగుపెట్టారు.

యితే ఈ 16 కంటెస్టెంట్స్ లో ఒకామె మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. మహారాష్ట్ర రుచులను ఢిల్లీ నగరవాసులకు అలవాటు చేసిన ఆమె పేరు చంద్రిక గెరా దీక్షిత్.

తాజాగా ఈ అందాల తార హిందీ బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్‌లో అడుగుపెట్టింది. తాజా ఎపిసోడ్‌లో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను కంటెస్టెంట్స్ తో పంచుకుంది.

ఇందులో భాగంగా తన సంపానను కూడా బయట పెట్టింది చంద్రిక. ఢిల్లీ రోడ్లపై వడపావ్ అమ్ముతూ తాను రోజుకు రూ.40 వేలు సంపాదిస్తాను అని చంద్రిక చెప్పడంతో తోటి కంటెస్టెంట్స్ నోరెళ్ల బెట్టారు.

అదే సమయంలో తల్లిదండ్రులపై ఏ మాత్రం ఆధారపడకుండా తన సొంత కాళ్లపై నిలబడిన చంద్రికను చూసి తోటి కంటెస్టెంట్స్ మెచ్చుకున్నారు.

ఈ సీజన్ 3లో చంద్రికా దీక్షిత్ తో పాటు నటుడు రణ్‌వీర్ ష్రాయ్, శివానీ కుమారీ, బాక్సర్ నీరజ్ గోయట్, ప్రముఖ లాయర్ సనా మక్బూల్ ఖాన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ విశాల్ పాండే, లవ్ కేష్ కటారియా తదితరులు హౌజ్ లో కి అడుగుపెట్టారు.