- Telugu News Photo Gallery Cinema photos Mrunal Thakur acts in Prabhas Kalki 2898 AD movie without remuneration for this reason
Kalki 2898 AD: కల్కి సినిమాకు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ కూడా తీసుకోని మృణాళ్ ఠాకూర్.. కారణమిదే
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా గురువారం (జూన్ 27) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది.
Updated on: Jun 27, 2024 | 8:01 PM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా గురువారం (జూన్ 27) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది.

అలాగే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు.

వీరితో పాటు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ గోపాల్ వర్మ, మృణాళ్ ఠాకూర్ తదితరులు క్యామియో రోల్స్ పోషించారు

కల్కి 2898 ఏడీలో గినియా అనే పాత్రలో మృణాల్ ఠాకూర్ కనిపించింది. సినిమా ఆరంభంలోనే మృణాల్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది.

కాగా కల్కిలో గెస్ట్ రోల్ కోసం మృణాల్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని సమాచారం. ఇందుకు ప్రత్యేక కారణముందట.

సీతారామంతో తనకు తెలుగులో బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అభిమానంతోనే మృణాల్ కల్కి సినిమాలో ఫ్రీగా నటించిందట.