బిగ్ బాస్ రియాల్టీ షో ముందు వరకు ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ బిగ్ బాస్ సీజన్ 5లోకి అడుగుపెట్టి తన మాట, తీరుతో తెలుగు జనాలను ఆకట్టుకుంది. ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్, రీల్స్ అంటూ తెగ హడావిడి చేస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై బ్రహ్మముడి సీరియల్లో స్వప్న పాత్రలో నటిస్తుంది.