- Telugu News Photo Gallery Cinema photos Tollywood Star Heroes Movies Shooting Updates and details here Telugu Heroes Photos
Shooting Update: తెలుగు స్టార్ హీరోస్ అందరూ షూటింగ్స్ లోనే బిజీ అయిపోయారు.?
రాజమౌళి సినిమా కమిటయ్యారు కాబట్టి ఇప్పట్లో మహేష్ బాబును సెట్స్‌లో చూడలేం.. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యే పవర్ తీసుకున్నారు కాబట్టి ఆయన కూడా ఇంకొన్నాళ్లు కెమెరా ముందుకు రావడం కష్టమే.! రామ్ చరణ్ బ్రేక్స్ తీసుకుంటూ షూటింగ్‌కు వస్తున్నారు. మిగిలిన వాళ్లు మాత్రం అంతా లొకేషన్స్‌లోనే ఉన్నారు. ముఖ్యంగా సీనియర్స్ కూడా సెట్స్‌లో సెట్ అయిపోయారు. ప్రభాస్ చాలా బిజీగా ఉన్నారు.
Anil kumar poka | Edited By: Ram Naramaneni
Updated on: Jun 28, 2024 | 8:49 PM

రాజమౌళి సినిమా కమిటయ్యారు కాబట్టి ఇప్పట్లో మహేష్ బాబును సెట్స్‌లో చూడలేం.. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యే పవర్ తీసుకున్నారు కాబట్టి ఆయన కూడా ఇంకొన్నాళ్లు కెమెరా ముందుకు రావడం కష్టమే.!

దీంతో ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. గతంలో గ్యాప్ తీసుకోకుండా వరుస సినిమాలు చేసిన చరణ్, ట్రిపులార్ కోసం మూడేళ్లు కేటాయించారు. దీంతో కెరీర్‌లో లాంగ్ బ్రేక్ వచ్చింది.ట్రిపులార్ సెట్స్ మీద ఉండగానే గేమ్ చేంజర్ సినిమా స్టార్ట్ చేసినా.. ఆ సినిమా కూడా మూడేళ్లుగా సెట్స్ మీదే ఉంది.

ఓ వైపు కల్కి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కోసం దేశమంతా తిరిగేస్తున్నారు రెబల్ స్టార్. ఆ మధ్య చిన్న బ్రేక్ తీసుకున్న చిరంజీవి.. విశ్వంభరతో మళ్లీ బిజీ అయ్యారు. వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో జరుగుతుంది.

ట్రిపులార్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటింది. ఇంతవరకు తారక్ నెక్ట్స్ మూవీ ఆడియన్స్ ముందుకు రాలేదు. కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న జూనియర్, సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకు రానుంది.

మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య.. ఈ మధ్యే బాబీ సినిమా లొకేషన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. NBK 109 షూట్ ప్రస్తుతం హిమాయత్ సాగర్‌లో జరుగుతుంది. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ షూటింగ్ ముంబైలో జరుగుతుంది.

గోపీచంద్, శ్రీను వైట్ల విశ్వంతో పాటు రామ్, పూరీ కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ షూట్ అల్యూమీనియం ఫ్యాక్టరీలోనే జరుగుతుంది. రవితేజ మిస్టర్ బచ్చన్ జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతుంది.

సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా షూట్ తుక్కు గూడలో జరుగుతున్నాయి. నాగార్జున, ధనుష్ నటిస్తున్న కుబేరా షూటింగ్ ఒకేసారి ముంబైతో పాటు ఉప్పల్‌లో చిత్రీకరిస్తున్నారు మేకర్స్.





























