Prabhas – Kalki 2898 AD: కల్కి 2898 AD తో.. డార్లింగ్‌కి నెంబర్‌ వన్‌ స్థాయి దక్కుతుందా.?

డార్లింగ్‌ ప్రభాస్‌, సినీ షెహన్‌షా అమితాబ్‌, యూనివర్శల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌, గార్జియస్‌ దీపిక, సిజ్లింగ్‌ గర్ల్ దిశా పాట్ని కలిసి కట్టుగా కల్కి 2898 ఏడీతో నేటినుండి థియేటర్స్ లో సందడి చేస్తుంది. దర్శకుడిగా విజయపరంపర కొనసాగిస్తున్న నాగ్‌ అశ్విన్‌ ఐదేళ్ల పాటు తీర్చిదిద్దిన కథతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ చిత్రం ఎన్ని రికార్డులను క్రియేట్‌ చేస్తుంది.? మరెన్ని రికార్డులను బ్రేక్‌ చేస్తుందనే చర్చ ఆసక్తిగా జరుగుతోంది.

|

Updated on: Jun 30, 2024 | 6:51 PM

భారతాన్ని చెప్పాలంటే కనీసం 10 భాగాలు కావాలంటూ అప్పట్లో రాజమౌళి లాంటి దర్శకుడే చెప్పాడు. అందుకే నాగ్ అశ్విన్ కూడా కల్కికి పార్ట్ 2 అనౌన్స్ చేయలేదు. ఏకంగా సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించారు.

1 / 8
నాగ్ అశ్విన్ ఇమాజినేషన్‌కు అంతా ఫిదా అవుతున్నారిప్పుడు. కేవలం రెండే రెండు సినిమాల అనుభవంతో ఏకంగా మహా భారతాన్ని కళ్ల మందు చూపించేసారు ఈ దర్శకుడు.  ఇంత పెద్ద కథను ఒకే పార్ట్‌లో చెప్పడం కష్టమే.

2 / 8
ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత మరే తెలుగు సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ దగ్గర వెయ్యి కోట్ల మార్కు చూడలేదు. మొన్నామధ్య యానిమల్‌ థౌజండ్‌ క్రోర్స్ ని టచ్‌ చేస్తుంది. దాటుతుందని చాలా మంది ఆశించినా, దగ్గరిదాకా వచ్చిందే కానీ, వెయ్యి కోట్ల మార్కును టచ్‌ చేయలేకపోయింది.

3 / 8
ఆ సీజన్‌లోనే విడుదలైన డార్లింగ్‌ సలార్‌కి వెయ్యికోట్ల ఛాన్స్ ఉన్నప్పటికీ, 700 ప్లస్‌ కలెక్షన్లతోనే సరిపెట్టుకుంది. ప్రశాంత్‌ నీల్‌కి వెయ్యి కోట్ల మార్క్ టచ్‌ చేసిన ఎక్స్ పీరియన్స్ ఉన్నప్పటికీ, సలార్‌ విషయంలో మాత్రం ఎందుకో అంత లాగలేకపోయారు.

4 / 8
తెలుగు హీరోలు, కెప్టెన్లు తడబడ్డ చోట, నేనున్నా అంటూ గ్యాప్‌ని ఫిల్ చేసే ప్రయత్నం చేశారు కోలీవుడ్‌ కెప్టెన్‌ అట్లీ. బాలీవుడ్‌ బాద్షా హీరోగా అట్లీ డైరక్షన్‌లో తెరకెక్కిన సినిమా జవాన్‌. బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్లు కొల్లగొట్టింది. షారుఖ్‌కి లాస్ట్ ఇయర్‌ ముచ్చటగా రెండో వెయ్యికోట్లను దాటిన రికార్డును క్రియేట్‌ చేసింది.

5 / 8
అయితే, ఆ సినిమా కలెక్షన్లను రాబట్టడంలో షారుఖ్‌ హవా ఎక్కువుందన్నది అందరూ చెప్పిన మాట. సౌత్‌ కెప్టెనే అయినా, సౌత్‌ హీరో కాదు కాబట్టి, మన ఖాతాలోకి పడలేదు ఆ హిట్‌. సో ఎన్నాళ్లుగానో సౌత్‌ బిజినెస్‌ సర్కిల్స్ ఆసక్తిగా వెయిట్‌ చేస్తున్న థౌజండ్‌ ప్లస్‌ క్రోర్స్ మార్క్ మూవీగా కల్కి నిలుస్తుందనే నమ్మకం కనిపిస్తోంది.

6 / 8
ఆల్రెడీ 600 కోట్లకు పైగా పెట్టిన పెట్టుబడి, దగ్గరదగ్గర 400 కోట్లదాకా జరిగిన ప్రీ రిలీజ్‌ బిజినెస్‌, ఓవర్సీస్‌లో రికార్డులు క్రియేట్‌ చేస్తున్న బుకింగ్స్. ఇవన్నీ వసూళ్ల మీద మంచి ప్రభావాన్నే చూపిస్తాయనే అంచనాలున్నాయి. డే ఒన్‌ ఆల్‌ టైమ్‌ రికార్డుతో పాటు, వసూళ్లలోనూ దుమ్ముదులుపుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

7 / 8
ఐదేళ్ల స్కిప్ట్, మూడేళ్ల ప్రొడక్షన్‌, సాంకేతికంగా ఇలాంటి సినిమాను ఇప్పటిదాకా చూడలేదన్న అమితాబ్‌ వ్యాఖ్యలు, ఈ సినిమాలో కేరక్టర్‌ని చేయగలనా అని భయపడ్డానన్న కమల్‌ మాటలు.. వీటిన్నిటి రిజల్ట్ ఎలా ఉండబోతోందో చెప్పడానికి కౌంట్‌ డౌన్‌ మొదలైంది.

8 / 8
Follow us