- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan has changed his plans regarding His Pending movies Telugu Heroes Photos
Pawan Kalyan: సినిమాల విషయంలో ప్లాన్ మార్చిన పవన్ కళ్యాణ్.. ఉన్నట్టా.? లేనట్టా.?
పొలిటికల్‌గా ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తనకు పెద్దగా అలవాటు లేని పోజిషన్‌ను నెమ్మదిగా అర్ధం చేసుకుంటున్నారు. అందుకే హరీబరీగా సినిమాల మీదకు ఫోకస్ మార్చేయకుండా కాస్త టైమ్ తీసుకోవాలనుకుంటున్నారు. పవన్ పొలిటికల్ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్స్ సినిమాల విషయంలో మాత్రం వెలితిగా ఫీల్ అవుతున్నారు.
Updated on: Jun 30, 2024 | 6:02 PM

పొలిటికల్‌గా ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తనకు పెద్దగా అలవాటు లేని పోజిషన్‌ను నెమ్మదిగా అర్ధం చేసుకుంటున్నారు.

వై నాట్.. ఇప్పుడు ఆయన లుక్‌ని చూసిన ఎవరైనా.. ఆయన మనసులో సినిమాలకున్న స్థానం ఏంటో చెప్పకనే చెప్పగలరు.. మా ఓజీ సిద్ధమవుతున్నారంటూ ఓపెన్‌గా డిక్లేర్ చేసేయగలరు.!

నిన్న మొన్నటి వరకు ఎలక్షన్ల తరువాత పవన్ సినిమాల మీద ఫోకస్ చేస్తారని భావించిన అభిమానులకు షాక్ ఇచ్చే అప్‌డేట్స్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

కేవలం అభిమానులే కాదు.. నాని లాంటి స్టార్స్ కూడా ఓజి గురించి అప్‌డేట్స్ అడిగి మరీ తెలుసుకుంటున్నారు. సరిపోదా శనివారం ప్రమోషన్స్‌లో ఓజి చర్చే ఎక్కువగా నడుస్తుంది. దానికి కారణం రెండు సినిమాలకు నిర్మాత డివివి దానయ్యే కాబట్టి.

ఎక్కడికెళ్ళినా.. ఏం చేసినా.. ఎవరిని కదిపినా ఆ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. దాని అప్‌డేట్సే కావాలంటున్నారు. ఈ ఒక్క టీజర్ ఏడాది నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు తారకమంత్రంలా మారిపోయింది.

అది కూడా ఒకేసారి అన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చేయకుండా ఒక సినిమా తరువాత సినిమాను లైన్‌లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. సో.. హరి హర వీరమల్లు త్వరలోనే ఆడియన్స్ ముందుకు వచ్చినా..

పుట్టినరోజు పూర్తయ్యాక, దసరా వేడుకలు కూడా మొదలయ్యాక ఓజీ సినిమాకు కాల్షీట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట పవర్‌స్టార్. రీసెంట్‌గా ఆయన్ని కలిసిన ప్రొడ్యూసర్స్ తోనూ ఈ విషయాన్నే చెప్పారని టాక్.




