- Telugu News Photo Gallery Cinema photos Kalki 2898 AD Movie Heroine Disha Patani Wants a Jet Fighter Before Movies telugu movie news
Disha Patani: జెట్ ఫైటర్ అవ్వాలనుకున్న కల్కి హీరోయిన్.. సినిమాల్లోకి రావడానికి కారణం అదే..
బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో దిశా పటానీ ఒకరు. తెలుగులో లోఫర్ సినిమాతో కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయి వరుస హిట్స్ అందుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న కల్కి 2898 ఏడి చిత్రంలో కీలకపాత్ర పోషించింది. ఈ సినిమాతో పాన్ ఇండియా వరల్డ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న కంగువా సినిమాతో అలరించడానికి రెడీ అవుతుంది.
Updated on: Jun 30, 2024 | 1:28 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో దిశా పటానీ ఒకరు. తెలుగులో లోఫర్ సినిమాతో కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయి వరుస హిట్స్ అందుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న కల్కి 2898 ఏడి చిత్రంలో కీలకపాత్ర పోషించింది.

ఈ సినిమాతో పాన్ ఇండియా వరల్డ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న కంగువా సినిమాతో అలరించడానికి రెడీ అవుతుంది. దీంతో దిశాకు సౌత్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ రానున్నట్లు తెలుస్తోంది.

అయితే దిశా పటానీ సినిమాల్లోకి అనుకోకుండా వచ్చిందట. సినిమాల్లోకి రావడానికి తన డ్రీమ్ త్యాగం చేయాల్సి వచ్చిందట. సిని

దిశా పటానీ తండ్రి పోలీస్ అధికారి, తల్లి హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్. ఇక అన్న లెఫ్ట్ నెంట్ కల్నల్. అతడి స్పూర్తితోనే దేశ సేవలో భాగమవ్వాలనుకుందట. అందుకే ఆర్మీలో ఫైటర్ జెట్ నడిపే పైలెట్ కావాలనుకుందట. అందుకు అవసరమైన శిక్షణ కూడా తీసుకుందట. అలాగే రాత పరీక్షకు కూడా సిద్ధమయ్యింది.

కానీ ఫిట్నెస్ పరంగా ఆ ఉద్యోగానికి కావాల్సినంత ఫిట్ గా ఉండకపోవడంతో తన డ్రీమ్ మధ్యలోనే వదిలేసిందట. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తి రావడంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. జెట్ ఫైటర్ కావాలనుకున్న నటి ఇప్పుడు హీరోయిన్ అయ్యింది.




