AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vengal Rao-Simbu: వైద్యానికి డబ్బుల్లేక దీన స్థితిలో ప్రముఖ కమెడియన్.. 2 లక్షల ఆర్థిక సాయం చేసిన హీరో శింబు

ప్రముఖ తమిళ కమెడయన్ వెంగళ్ రావు అంటే తెలుగు ప్రేక్షకులు ఠక్కున గుర్తు పట్టకపోవచ్చు. కానీ తమిళ ప్రేక్షకులు ఇట్టే గుర్తు పడతారు. ముఖ్యంంగా వడివేలు- వెంగళ్ రావు కాంబినేషన్ కోలీవుడ్ లో బాగా ఫేమస్. వీరు కలిసి నటించిన సీన్లు కోలీవుడ్ ఆడియెన్స్ ను గిలిగింతలు పెట్టాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే వెంగళ్ రావు తెలుగు వ్యక్తి కావడం. ఆయన సొంతూరు విజయవాడ.

Vengal Rao-Simbu: వైద్యానికి డబ్బుల్లేక దీన స్థితిలో ప్రముఖ కమెడియన్.. 2 లక్షల ఆర్థిక సాయం చేసిన హీరో శింబు
Vengal Rao, Simbu
Basha Shek
|

Updated on: Jun 27, 2024 | 4:49 PM

Share

ప్రముఖ తమిళ కమెడయన్ వెంగళ్ రావు అంటే తెలుగు ప్రేక్షకులు ఠక్కున గుర్తు పట్టకపోవచ్చు. కానీ తమిళ ప్రేక్షకులు ఇట్టే గుర్తు పడతారు. ముఖ్యంంగా వడివేలు- వెంగళ్ రావు కాంబినేషన్ కోలీవుడ్ లో బాగా ఫేమస్. వీరు కలిసి నటించిన సీన్లు కోలీవుడ్ ఆడియెన్స్ ను గిలిగింతలు పెట్టాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే వెంగళ్ రావు తెలుగు వ్యక్తి కావడం. ఆయన సొంతూరు విజయవాడ. తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఆయన ప్రస్తుతం దీన స్థితిలో ఉన్నాడు. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించిన ఆయన ఆర్థికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా వడివేలుపై నిషేధం విధించాక వెంగళ్ రావుకు కూడ సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఫలితంగా ఆయన ఇప్పుడు సమస్యల సుడిగుండంలో కొట్టు మిట్టాడుతున్నాడు. అనారోగ్య సమస్యలతో బాగా బక్క చిక్కిపోయాడీ స్టార్ కమెడియన్. చివరకు చికిత్సకు డబ్బుల్లేకపోవంతో ఆర్థిక సాయం చేయాలంటూ ఆర్ధిస్తున్నాడు. ప్రస్తుతం విజయవాడలో ఉంటున్న వెంగళ్ రావు.. ఒక చేయి, ఒక కాలు పోగొట్టుకున్నానని, ప్రస్తుతం ట్రీట్ మెంట్ కు కూడా డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్నానని కన్నీటి పర్యంతమవుతూ ఒక వీడియోను రిలీజ్ చేచేశారు. కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలామంది వెంగళ రావుకు సహాయం చేయాలని వడివేలును కోరారు. అయితే ఈ విషయం వడివేలుకు ఇంకా తెలిసినట్లు లేదు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో శింబు మాత్రం వెంటనే స్పందించారు. వెంగళ్ రావు చికిత్స, ఇతర ఖర్చుల మిత్తం రూ. 2 లక్షల తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు శింబు చేసిన మంచి పనిని ప్రశంసిస్తున్నారు. అతని లాగే మరికొందరు హీరోలు, నటీనటులు వెంగళ్ రావుకు సహాయం అందించాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా 2022 జూన్ లో వెంగళ్ రావు కాలేయ వ్యాధి బారిన పడ్డాడు. విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో వెంగళ్ రావు కుమార్తె లక్ష్మి ఆయనకు అండగా నిలిచింది. సుమారు వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత వెంగళ్ రావు కోలుకున్నాడు. మళ్లీ ఇప్పుడు అనారోగ్యం బారిన పడ్డారీ స్టార్ కమెడియన్.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..