ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఒకప్పటి సెన్సేషనల్ హీరోయిన్.. 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఈరోజే స్క్రీన్‌పై దర్శనం

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున.. తమిళంలో రజినీకాంత్, కమల్ హసన్.. మలయాళంలో మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. పలు సూపర్ డూపర్ హిట్ సినిమాలు, అవార్డ్ విన్నింగ్ మూవీస్ లో నటించిన ఈ అందాల తార గత 18 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది

ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఒకప్పటి సెన్సేషనల్ హీరోయిన్.. 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఈరోజే స్క్రీన్‌పై దర్శనం
Tollywood Senior Actress Childhood Photo
Follow us

|

Updated on: Jun 27, 2024 | 8:01 AM

పై ఫొటోలో క్యూట్‌ గా కనిపిస్తున్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఈమె ఒకప్పటి అందాల నటి. 80-90s లలో తన అందం, అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను అలరించింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున.. తమిళంలో రజినీకాంత్, కమల్ హసన్.. మలయాళంలో మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. పలు సూపర్ డూపర్ హిట్ సినిమాలు, అవార్డ్ విన్నింగ్ మూవీస్ లో నటించిన ఈ అందాల తార గత 18 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తోంది. అది కూడా పాన్ ఇండియా స్టార్ మూవీతో. ప్రభాస్ నటించిన కల్కి సినిమా గురువారం (జూన్ 27) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో ఈ సీనియర్ నటి ఒక కీలక పాత్ర పోషించారు. ఆమె మరెవరో కాదు అలనాటి అందాల తార శోభన. కేవలం నటిగానే కాకుండా క్లాసికల్ డ్యాన్సర్ గా గుర్తింపు పొందిన ఆమె కల్కి సినిమాలో మరియమ్ అనే పాత్రలో కనిపించనన్నారు. కొన్నిరోజుల క్రితమే సినిమాలో ఆమె లుక్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో కల్కి సినిమాలో శోభన పాత్ర ఎలా ఉంటుందోనని తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగ ఎదురు చూస్తున్నారు

2006లో వచ్చిన మోహన్ బాబు, మంచు విష్ణుల సినిమాలో చివరి సారిగా నటించారు శోభన. ఆ తర్వాత కెమెరాకు దూరంగా ఉండిపోయయారు. మళ్లీ ఇప్పుడు ప్రభాస్ కల్కి సినిమాతో సుమారు 18 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారీ అందాల తార. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమాలో ప్రభాస్ భైరవుడిగా కనిపించనున్నాడు. అలాగే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కథానాయికగా కనిపించనుంది. అమితాబ్, కమల్ హాసన్, మాళవిక నాయర్, దిశ పటానీ వంటి స్టారాది స్టార్లు ఈ మూవీలో కీలక పాత్రలు పోించారు. వైజయంతీ మూవీస్ బ్యానర పై భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా గురువారం (జూన్ 27) న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన కల్కి థియేటర్లలోకి వచ్చాక మరెన్ని రికార్డులు అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో