AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: అనంత్- రాధిక క్రూయిజ్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్‌గా అలియా- రణ్ బీర్.. రొమాన్స్ మాములుగా లేదుగా

అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ఇటీవలే వారి రెండవ ప్రీ వెడ్డింగ్ వేడుకను జరుపుకున్నారు. ఇటలీ వేదికగా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది. ఇందులో వివిధ రంగాల నుంచి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన భర్త రణబీర్ కపూర్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైంది

Alia Bhatt: అనంత్- రాధిక క్రూయిజ్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్‌గా అలియా- రణ్ బీర్.. రొమాన్స్ మాములుగా లేదుగా
Ranbir Kapoor, Alia Bhatt
Basha Shek
|

Updated on: Jun 25, 2024 | 10:09 PM

Share

అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ఇటీవలే వారి రెండవ ప్రీ వెడ్డింగ్ వేడుకను జరుపుకున్నారు. ఇటలీ వేదికగా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది. ఇందులో వివిధ రంగాల నుంచి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన భర్త రణబీర్ కపూర్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైంది. కాగా అంబానీ, కపూర్ కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే రణబీర్‌, అలియా అంబానీలు ప్రతి చిన్నా పెద్దా ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. అనంత్- రాధికల రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక ముగిసినా సోషల్ మీడియాలో దీని గురించి చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. అందుకు కారణం సెలబ్రిటీలు తమ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. అలా తాజాగా అలియా భట్ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇటీవల, రియా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాధిక మర్చంట్ లుక్‌కి సంబంధించిన అనేక చిత్రాలను పంచుకున్నారు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫోటోలను షేర్ చేసింది అలియా. ఈ ఫోటోలో నటి అలియా పౌడర్ బ్లూ గౌనులో కనిపిస్తోంది. ఇందులో ఆమె చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలో అలియా రణబీర్ కపూర్ చేయి పట్టుకుని కనిపించింది.

ఈ ఫొటోల్లో రణ్ బీర్ కూడా చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు. ముఖానికి మాస్క్ వేసుకుని మరింత స్టైలిష్ గా ముస్తా బయ్యాడు. ప్రస్తుతం అలియా-రణ్ బీర్ దంపతుల ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. క్యూట్ కపుల్ అంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. అలియా భట్ త్వరలో జిగ్రా మూవీలో కనిపించనుంది. ఇది కాకుండా, సంజల్ లీలా బన్సాలీ లవ్ అండ్ వార్‌లో కూడా నటిస్తోంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ నటించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, రణబీర్ కపూర్, అలియా భట్ ల కూతురు రాహా కపూర్ మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇటీవల, కపూర్ కుటుంబం వారి కొత్త ఇంటిని చూడటానికి వచ్చింది. ఈసారి రాహా తన తల్లిదండ్రులతో కలిసి నిర్మాణ స్థలాన్ని సందర్శించింది. అక్కడ ముగ్గురూ కెమెరాకు చిక్కారు. రాహా కపూర్ బాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ స్టార్ కిడ్. తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇట్టే వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్