AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ZIM vs IND: జింబాబ్వే టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. టీమిండియాలోకి తెలుగు తేజం నితీష్ రెడ్డి

జింబాబ్వే పర్యటనలో టీమిండియా మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ ఐదు మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరగనున్నాయి. మ్యాచ్‌లు సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్ జూలై 7న జరగనుంది.

ZIM vs IND: జింబాబ్వే టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. టీమిండియాలోకి తెలుగు తేజం నితీష్ రెడ్డి
Team India
Follow us
Basha Shek

|

Updated on: Jun 24, 2024 | 10:12 PM

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత టీమిండియా జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ పర్యటనలో జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడనుంది. సోమవారం ఈ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. టీమ్ ఇండియాకు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహించనున్నాడు. ఈ పర్యటనలో చాలా మంది కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. జింబాబ్వే పర్యటనలో టీమిండియా మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ ఐదు మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరగనున్నాయి. మ్యాచ్‌లు సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్ జూలై 7న జరగనుంది. ఈ సిరీస్ జూలై 14తో ముగుస్తుంది. ఈ టీ20 సిరీస్‌కు సెలక్షన్ కమిటీ తొలిసారిగా పలువురు యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. ముఖ్యంగా ఇటీవల జరిగిన IPL 2024 టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు స్థానం కల్పించారు. అందులోనూ ఆశ్చర్యకరంగా, టీ20 ప్రపంచకప్‌లో ప్లేయింగ్ ఎలెవన్ లో కనిపించిన ఒక్క ఆటగాడిని మాత్రమే ఈ సిరీస్‌కు జట్టులో ఎంపిక చేయలేదు. విశేషమేమిటంటే.. భారత జట్టులో ఆంధ్రా కు చెందిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ నితీష్ రెడ్డికి చోటు దక్కింది.

నితీష్ రెడ్డితో పాటు తుషార్ దేశ్‌పాండే (సీఎస్‌కే), రియాన్‌ పరాగ్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌), అభిషేక్‌ శర్మ (ఎస్‌ఆర్‌హెచ్‌), నితీశ్‌ రెడ్డి వంటి యువ ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశం కల్పించింది. సంజూ శాంసన్‌, జితేష్‌ శర్మ వికెట్‌ కీపర్‌లుగా జట్టులో స్థానం సంపాదించారు. షెడ్యూల్ ప్రకారం, సిరీస్ జూలై 6 నుండి ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో ఐదు టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. భారత టీ20 జట్టులోకి తొలిసారి ఐదుగురు ఆటగాళ్లు ఎంపికయ్యారు. ఈ ఐదుగురు ఆటగాళ్లు అభిషేక్ శర్మ, ర్యాన్ పరాగ్, నితీష్ రెడ్డి, తుషార్ దేశ్‌పాండే, ధృవ్ జురెల్ గత ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేశారు.

జింబాబ్వే సిరీస్‌తో నలుగురు ఆటగాళ్లు టీమ్ ఇండియాకు తిరిగి వచ్చారు, రుతురాజ్ గైక్వాడ్‌కు మరో అవకాశం లభించింది. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ మళ్లీ జట్టులోకి వచ్చారు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన కకేఎల్ రాహుల్‌కు మళ్లీ జట్టులో అవకాశం రాలేదు. టీ20 ప్రపంచకప్‌ నుంచి రాహుల్‌ను కూడా తప్పించారు. ప్రస్తుతం జింబాబ్వే సిరీస్‌కు అతడిని పరిగణనలోకి తీసుకోలేదు.

ఇవి కూడా చదవండి

జింబాబ్వే పర్యటనకు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యస్సావి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, ర్యాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే.

భారతదేశం  జింబాబ్వే టూర్ షెడ్యూల్

  • జూలై 6 – 1వ T20, హరారే
  • 7 జూలై – 2వ T20, హరారే
  • జూలై 10 – 3వ T20, హరారే
  • జూలై 13 – 4వ T20, హరారే
  • జూలై 14 – 5వ T20, హరారే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..