Market Mahalakshmi OTT: ఓటీటీలోకి క్లాస్ అబ్బాయి.. మాస్ అమ్మాయి లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌, రోజులు మారాయి, సావిత్రి వైఫ్ ఆఫ్ స‌త్య‌మూర్తి, భ‌లే మంచి చౌక‌బేర‌మ్ తో పాటు ప‌లు చిన్న సినిమాల్లో హీరోగా పార్వ‌తీశం క‌నిపించాడు. కానీ ఇవేవీ అతనికి గుర్తింపు ను తీసుకురాలేకపోయాయి. అలా ఈ మధ్యనే ‘మార్కెట్ మహాలక్ష్మి' తో మన ముందుకు వచ్చాడు పార్వతీశం

Market Mahalakshmi OTT: ఓటీటీలోకి క్లాస్ అబ్బాయి.. మాస్ అమ్మాయి లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Market Mahalakshmi Movie
Follow us

|

Updated on: Jun 23, 2024 | 12:42 PM

కేరింత మూవీ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో పార్వతీశం. అందులో తన యాస, భాషతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. అయితే వన్ ఫిల్మ్ వండర్ లా కేరింత తర్వాత అతనికి హిట్ పడలేదు. నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌, రోజులు మారాయి, సావిత్రి వైఫ్ ఆఫ్ స‌త్య‌మూర్తి, భ‌లే మంచి చౌక‌బేర‌మ్ తో పాటు ప‌లు చిన్న సినిమాల్లో హీరోగా పార్వ‌తీశం క‌నిపించాడు. కానీ ఇవేవీ అతనికి గుర్తింపు ను తీసుకురాలేకపోయాయి. అలా ఈ మధ్యనే ‘మార్కెట్ మహాలక్ష్మి’ తో మన ముందుకు వచ్చాడు పార్వతీశం. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొత్త అమ్మాయి ప్రణీకాన్వికా హీరోయిన్ గా నటించింది. బి2పి స్టూడియోస్ బ్యానరపై అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ నెలలో థియేటర్లలో రిలీజైంది. ఓ మోస్తరుగా ఆడింది. అయితే థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడేలేకపోయింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ‘మార్కెట్ మహాలక్ష్మి’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆహాలో ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ స్ట్రీమింగ్ కు రానుంది. అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు.

బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన మార్కెట్ మహాలక్ష్మి చిత్రంలో చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక మార్కెట్ మహాలక్ష్మి సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. మరోవైపు హీరోయిన్ తన సొంత కాళ్లపై నిలబడాలనుకుంటుంది. అయితే హీరో తండ్రి మాత్రం.. తనకు కట్నం ఎక్కువ ఇచ్చే పిల్లతోనే అతని పెళ్లి జరిపించాలని ఫిక్స్ అవుతాడు. అలా హీరో ఓ రోజు మార్కెట్ లో కూరగాయలు అమ్ముతున్న మహాలక్ష్మి అనే అమ్మాయిని చూస్తాడు. నచ్చి ప్రపోజ్ కూడా చేస్తాడు. కానీ ఆమె మాత్రం అతనిని రిజెక్ట్ చేస్తుంది. మరి మహాలక్ష్మి బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఏంటి ! హీరో తండ్రి తన ప్రేమను అంగీకరించాడా? లేదా ! అన్నది తెలుసుకోవాలంటే మార్కెట్ మహాలక్ష్మి సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తలకు బలంగా తాకిన బంతి.. కట్ చేస్తే.. మైదానంలో రక్తపుమడుగులో బౌలర్
తలకు బలంగా తాకిన బంతి.. కట్ చేస్తే.. మైదానంలో రక్తపుమడుగులో బౌలర్
వర్షాకాలంలో కాళ్లకు వచ్చే చర్మ సమస్యలకు.. ఈ చిట్కాలతో ఉపశమనం..
వర్షాకాలంలో కాళ్లకు వచ్చే చర్మ సమస్యలకు.. ఈ చిట్కాలతో ఉపశమనం..
కలకలం రేపుతున్న చాందిపుర వైరస్‌.. అక్కడ మరో మరణం..! నిపుణుల సలహా.
కలకలం రేపుతున్న చాందిపుర వైరస్‌.. అక్కడ మరో మరణం..! నిపుణుల సలహా.
ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?
ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?
ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు మించిన ప్రాధాన్యం ఎందుకు?
ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు మించిన ప్రాధాన్యం ఎందుకు?
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌
మీ ఇంటిని ఇలా తుడిచారంటే.. ఆర్థిక కష్టాల నుంచి బయట పడతారు..
మీ ఇంటిని ఇలా తుడిచారంటే.. ఆర్థిక కష్టాల నుంచి బయట పడతారు..
Microsoft: సమస్యను ఎలా పరిష్కరించాలో తెలిపిన కంపెనీ మైక్రోసాఫ్ట్
Microsoft: సమస్యను ఎలా పరిష్కరించాలో తెలిపిన కంపెనీ మైక్రోసాఫ్ట్
క్యాబ్ డ్రైవర్ల కష్టాల జర్నీ.. వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు..
క్యాబ్ డ్రైవర్ల కష్టాల జర్నీ.. వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు..
మీరు కూడా జిమ్‌కి వెళ్తున్నారా..? ఇలాంటి ట్రైనర్స్ తో జర భద్రం..!
మీరు కూడా జిమ్‌కి వెళ్తున్నారా..? ఇలాంటి ట్రైనర్స్ తో జర భద్రం..!