Bhaje Vaayu Vegam OTT: ఓటీటీలో కార్తికేయ లేటెస్ట్ హిట్ మూవీ.. భజే వాయు వేగం స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
బెదురులంక వంటి సూపర్ హిట్ తర్వాత యంగ్ హీరో కార్తికేయ నటించిన చిత్రం 'భజే వాయు వేగం'. ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించినఈ యాక్షన్ థ్రిల్లర్ లో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించింది. టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్ తో ఆసక్తిని రేకెత్తించిన 'భజే వాయు వేగం' మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లను సొంతం చేసుకుంది.
బెదురులంక వంటి సూపర్ హిట్ తర్వాత యంగ్ హీరో కార్తికేయ నటించిన చిత్రం ‘భజే వాయు వేగం’. ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించినఈ యాక్షన్ థ్రిల్లర్ లో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించింది. టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్ తో ఆసక్తిని రేకెత్తించిన ‘భజే వాయు వేగం’ మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. దీంతో బెదురులంక తర్వాత కార్తికేయ ఖాతాలో మరో హిట్ పడింది. థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించిన భయే వాయు వేగం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం మేకర్స్, ఓటీటీ సంస్థల మధ్య భారీ డీల్ కుదిరందని సమచారం. ఈ మూవీ థియేట్రికల్ రన్ టైం పూర్తి చేసుకోవడంతో త్వరలోనే చిత్రాన్ని ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తెచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుందని సమాచారం. అన్నీ కుదిరితే ఈ నెల జూన్ 28న భజే వాయు వేగం సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకురావచ్చని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.
యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై భజే వాయు వేగం సినిమా తెరకెక్కింది.హ్యాపీ డేస్ ఫేం రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, కృష్ణ చైతన్య, సుదర్శన్,శరత్ లోహితస్వ, రవిశంకర్, కీలకపాత్రలు పోషించారు. తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. కపిల్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. క్రికెట్ బెట్టింగ్, యాక్షన్, ఛేజింగ్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ రెడ్డి. ముఖ్యంగా సెకండాఫ్ స్క్రీన్‍ప్లే, థ్రిల్లింగ్ సీన్లు బాగున్నాయని రివ్యూలు వచ్చాయి. యూవీ కాన్సెప్ట్ పతాకంపై నిర్మించిన ఈ మూవీకి రదన్, కపిల్ కుమార్ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో భజే వాయువేగం సినిమాను మిస్ అయ్యారా. అయితే కొన్ని రోజలు వెయిట్ చేయండి. ఎంచెక్కా ఓటీటీలో చూసి ఆనందించండి.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
#BhajeVaayuVegam streaming soon on #Netflix pic.twitter.com/px8NUuKui5
— Telugu TV Updates (@telugutvupdts) June 19, 2024
Behind every adrenaline-packed action there’s an equally strong emotion driving it 🚘💥
Experience it with #BhajeVaayuVegam in theaters today ❤️🔥 🎟️ https://t.co/1fXhjRwRvN #BVVInCinemasNow pic.twitter.com/E0420aVOJe
— Kartikeya (@ActorKartikeya) June 5, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.