AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Mouli OTT: అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఆహాలో నవదీప్ బోల్డ్ మూవీ.. ‘లవ్ మౌళి’ స్ట్రీమింగ్ డేట్ ఇదే

పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ తో లవ్ మౌళి సినిమాపై బాగా బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు నవదీప్ 2.0 అంటూ మూవీ ప్రమోషన్లు ఊదరగొట్టారు. నవదీప్ గెటప్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇలా భారీ అంచనాలతో జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ మౌళి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది

Love Mouli OTT: అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఆహాలో నవదీప్ బోల్డ్ మూవీ.. 'లవ్ మౌళి' స్ట్రీమింగ్ డేట్  ఇదే
Love Mouli Movie
Basha Shek
|

Updated on: Jun 23, 2024 | 6:41 AM

Share

టాలీవుడ్‌ యాక్టర్ నవదీప్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ సినిమా లవ్ మౌళి. పంఖురి గిద్వాని హీరోయిన్ గా నటించగా, ఛార్వీ దత్తా మరో ఫీమేల్ లీడ్ లో కనిపించింది. రానా దగ్గుబాటి అతిథి పాత్రలో మెరిశాడు. దర్శక ధీరుడు రాజమౌళి శిష్యుడు అవ‌నీంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ తో లవ్ మౌళి సినిమాపై బాగా బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు నవదీప్ 2.0 అంటూ మూవీ ప్రమోషన్లు ఊదరగొట్టారు. నవదీప్ గెటప్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇలా భారీ అంచనాలతో జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ మౌళి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. నవదీప్ నటనకు మంచి పేరొచ్చింది. అలాగే హీరోయిన్ పంఖురి గిద్వాని సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాజిటివ్ రివ్యూలు వచ్చినా ఎందుకో లవ్ మౌ ళి సినిమా లాంగ్ రన్ లో ఆడలేకపోయింది. దీంతో అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైందీ నవ దీప్ సినిమా. లవ్ మౌళి మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కొనుగోలు చేసింది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వెలువడింది. జూన్ 27 నుంచి లవ్ మౌళి సినిమా స్ట్రీమింగ్ కు రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది ఆహా. అలాగే సినిమాకు సంబంధించి ఒక కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

‘తను ప్రేమ గురించి మిమ్మల్ని గట్టిగా ఆలోచించేలా చేస్తాడు. త్వరలోనే ఆహాలో హార్ట్ బ్రేకింగ్ లవ్ స్టోరీ లవ్ మౌళి జర్నీని ఎక్స్‌పీరియన్స్ చేయండి’ అని క్యాప్షన్ ఇచ్చింది ఆహా. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్, సి స్పేస్ సంయుక్తంగా లవ్ మౌళి సినిమాను తెరకెక్కించారు. గోవింద్ వసంత ఈ సినిమాకు సంగీతం అందించారు. రిలేషన్‌లో ఉన్న ఒక ప్రేమ జంట రెండు సంవత్సరాలు సంతోషంగా ఉన్న తర్వాత.. వారిద్దరి మధ్య ఎందుకు అంత ప్రేమ ఉండటం లేదు. ఎందుకు ఆ రిలేషన్ బ్రేక్ అవుతుంది అనే కాన్సెప్ట్‌తో సినిమా సాగుతుంది. మరి థియేటర్లలో లవ్ మౌళి సినిమాను మిస్ అయ్యారా? అయితే కొద్ది రోజులు వెయిట్ చేయండి. త్వరలోనే ఆహా ఓటీటీలోకి రానుంది. ఎంచెక్కా ఇంట్లోనే నవ్ దీప్ ప్రేమకథను చూసేయండి.

20 రోజులకే ఓటీటీలోకి..

ఆహాలో స్ట్రీమింగ్..

లవ్ మౌళి  ట్రైలర్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్