AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie : హీరోయిన్ చేతిలో రాజకీయ నాయకుడి సీక్రెట్.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. 

ఓటీటీలోకి ప్రతి వారం వారం వివిధ జానర్ల సినిమాలు విడుదలవుతుంటాయి. అలాగే థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలతోపాటు ఒరిజినల్ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే ఈ వారం కూడా ఎన్నో హిట్ చిత్రాలు వచ్చేశాయి. అందులో ఒక తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆ సినిమా పేరెంటంటే..

OTT Movie : హీరోయిన్ చేతిలో రాజకీయ నాయకుడి సీక్రెట్.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. 
Anaganaga Australia Lo
Rajitha Chanti
|

Updated on: Mar 06, 2026 | 6:58 AM

Share

ఓటీటీలోకి కొత్త కొత్త సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ ప్లాట్ ఫామ్స్ లలో విభిన్న రకాల జానర్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఒకటి. నిజానికి ఈ మూవీ ఒక తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్. ఈ మూవీని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఓటీటీ సినీప్రియులకు ఈ సినిమా మరింత ఆసక్తి కలిగించింది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో ఇదివరకు ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి. అందులో ఈ సినిమా ఒకటి. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు అనగనగా ఆస్ట్రేలియాలో.. ఈ మూవీని పూర్తిగా కొత్త నటీనటులతో తెరకెక్కించారు. అలాగే టైటిల్ కు తగినట్లుగానే సినిమా మొత్తాన్ని ఆస్ట్రేలియాలో చిత్రీకరించారు. అయితే థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

కొత్త నటీనటులు కావడం.. ఎలాంటి హడావిడి లేకుండా ప్రమోషన్స్ చేయకపోవడంతో ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలో విడుదలైందో జనాలకు తెలియలేదు. 2025 మార్చి 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో జ్యోతినాథ్ గౌడ్, సాన్య భట్నాగర్ హీరోహీరోయిన్లుగా నటించారు. వీరిలో అగ్రజ లక్ష్మీ, చంద్ర కొమ్మల్‌పేట్, జేడీఆర్ చెరుకూరు, ప్రభ అగ్రజ కీలకపాత్రలు పోషించారు. అలాగే తారకరామ దర్శకత్వం వహించారు. యూవీ నిరంజన్ సంగీతం అందించగా.. క్రైమ్, బోల్డ్, సస్పెన్స్ అంశాలతో ఈ మూవీని రూపొందించారు. ఓ రాజకీయ నాయకుడికి సంబంధించిన సీక్రెట్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.

ప్రస్తుతం ఈ మూవీ తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. బోల్డ్, లవ్, క్రైమ్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు ఆహాలో అందుబాటులోకి వచ్చేసింది. కథ విషయానికి వస్తే.. ఓ రాజకీయ నాయకుడు తన కుమారుడిని రాజకీయాల్లో సెటిల్ చేయాలని భావిస్తుంటాడు. అదే సమయంలో అతడికి సంబంధించిన ఓ సీక్రెట్ తన దగ్గర ఉందంటూ ఆస్ట్రేలియా నుంచి ఫోన్ వస్తుంది. దీంతో వారిని చంపేయాలని కిల్లర్ కు కాంట్రాక్ట్ అప్పగిస్తాడు. ఆ తర్వాత అదే సీక్రెట్ హీరోయిన్ కు దొరుకుతుంది. దీంతో ఆమె ఓ ప్లాన్ చేస్తుంది. ఆమెకు హీరో ఎలా సహయం చేశాడు..? చివరకు ఆ సీక్రెట్ ఏంటీ ? అనేది సినిమా..

ఎక్కువమంది చదివినవి : Tollywood : అమీర్ పేట్ మెట్రో పక్కన ఉన్న సారథి స్టూడియో మాదే.. కానీ.. టాలీవుడ్ నటుడు..

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.

Follow Us
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
రెండు జ్యోతిర్లింగాలతో పాటు దక్షిణ భారత పుణ్యక్షేత్రాల సందర్శన..
రెండు జ్యోతిర్లింగాలతో పాటు దక్షిణ భారత పుణ్యక్షేత్రాల సందర్శన..
సూర్యాస్తమయం తర్వాత ఈ 5 వస్తువులు అస్సలు కొనకూడదు! కారణం తెలిస్తే
సూర్యాస్తమయం తర్వాత ఈ 5 వస్తువులు అస్సలు కొనకూడదు! కారణం తెలిస్తే
షేర్ మార్కెట్లో లాభాలు కొందరికే ఎందుకు? నష్టాల వెనుక అసలు రహస్యం
షేర్ మార్కెట్లో లాభాలు కొందరికే ఎందుకు? నష్టాల వెనుక అసలు రహస్యం
 కొత్తజంట పెళ్లయిన ఏడాది వరకు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండాలా?
 కొత్తజంట పెళ్లయిన ఏడాది వరకు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండాలా?
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్..
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్..
అత్యవసరమై 5 లక్షల కోసం అర్ధరాత్రి ఆ హీరోకు ఫోన్ చేశా.. కానీ..
అత్యవసరమై 5 లక్షల కోసం అర్ధరాత్రి ఆ హీరోకు ఫోన్ చేశా.. కానీ..
జీరోకే ఐదుగురు ఔట్.. సింగిల్ డిజిట్ దాటని ఆరుగురు..
జీరోకే ఐదుగురు ఔట్.. సింగిల్ డిజిట్ దాటని ఆరుగురు..
Mutton: మటన్ కొనేటప్పుడు 90శాతం మంది చేసే తప్పు ఇదే..
Mutton: మటన్ కొనేటప్పుడు 90శాతం మంది చేసే తప్పు ఇదే..