AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manish Pandey: భార్యతో టీమిండియా క్రికెటర్ విడాకులు! ‘NH4’ హీరోయిన్ ఫొటోలు తొలగించిన మనీష్ పాండే

టీమిండియా ప్లేయర్ మనీష్ పాండే , ప్రముఖ హీరోయిన్ అశ్రిత శెట్టిల వైవాహిక జీవితంలో మనస్పర్థలు తలెత్తాయా? 2019లో ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ రూమర్లకు ప్రధాన కారణం కర్ణాటక క్రికెటర్ మనీష్ పాండే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి తన భార్య ఫోటోలను తొలగించడమే.

Manish Pandey: భార్యతో టీమిండియా క్రికెటర్ విడాకులు! 'NH4' హీరోయిన్ ఫొటోలు తొలగించిన మనీష్ పాండే
Manish Pandey, Ashrita Shetty
Basha Shek
|

Updated on: Jun 22, 2024 | 12:27 PM

Share

టీమిండియా ప్లేయర్ మనీష్ పాండే , ప్రముఖ హీరోయిన్ అశ్రిత శెట్టిల వైవాహిక జీవితంలో మనస్పర్థలు తలెత్తాయా? 2019లో ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ రూమర్లకు ప్రధాన కారణం కర్ణాటక క్రికెటర్ మనీష్ పాండే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి తన భార్య ఫోటోలను తొలగించడమే. మరోవైపు అశ్రితా శెట్టి తన సోషల్ మీడియా ఖాతా నుండి తన భర్త ఫోటోలను కూడా డిలీట్ చేసింది. దీంతో మనీశ్- ఆశ్రితల బ్రేకప్ వార్తలకు బలం చేకూరుతోంది. అశ్రిత శెట్టి మంగళూరుకు చెందిన మోడల్ కమ్ నటి. 2012లో తుళు టెలిఫిల్మ్ బొల్లితో రంగుల ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో అశ్రిత ఉదయమ్ NH4, ఒరు కన్నియుమ్ మూను కలవనికలుమ్, ఇంద్రజిత్ చిత్రాల్లో నటించింది. ఈ అమ్మడు తెలుగు వారికి కూడా పరిచయమే. సిద్ధార్థ్ నటించిన NH4 సినిమాలో అశ్రితనే హీరోయిన్. ఇందులోని నీవెవ్వరో సాంగ్ అప్పట్లో చార్ట్ బస్టర్. ఇప్పటికీ చాలామందికీ ఈ సాంగ్ ఫేవరెట్.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా..

అయితే మనీశ్ ను ప్రేమ వివాహం చేసుకున్నాక రంగుల ప్రపంచానికి దూరంగా ఉండిపోయింది అశ్రిత. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉండేది. తన భర్త మనీష్ పాండేతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేసేది అశ్రిత. అయితే ఇప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో పాండే ఒక్క ఫోటో కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మనీష్ పాండే తన భార్యతో ఉన్న ఫోటోలన్నింటినీ తొలగించాడు.

ఇవి కూడా చదవండి

టీమిండియా తరఫున

టీమిండియా తరఫున 29 వన్డే మ్యాచ్‌లు ఆడిన మనీష్ పాండే 1 సెంచరీ, 2 అర్ధసెంచరీలతో మొత్తం 566 పరుగులు చేశాడు. అలాగే టీమ్ ఇండియా తరఫున 39 టీ20 మ్యాచ్ లు ఆడిన పాండే 3 అర్ధసెంచరీలతో మొత్తం 709 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో RCB, పూణే వారియర్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్‌జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల తరపున ఆడాడు మనీష్ పాండే. మొత్తం 171 మ్యాచ్‌లలో 1 సెంచరీ, 22 అర్ధ సెంచరీలు సాధించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..