T20 World Cup 2024: సింపుల్ క్యాచ్‌ను నేలపాలు చేసిన కింగ్ కోహ్లీ.. కెప్టెన్ రోహిత్ రియాక్షన్ చూశారా?

ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ లాంటి బెస్ట్‌ ఫీల్డర్‌ క్యాచ్‌ వదిలేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బ్యాటింగ్‌లో పరుగులు‌ చేయలేక సతమతమవుతోన్న కోహ్లీ.. ఇలా ఫీల్డింగ్‌లోనూ చెత్త ప్రదర్శన కనబరుస్తుండటం క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

T20 World Cup 2024: సింపుల్ క్యాచ్‌ను నేలపాలు చేసిన కింగ్ కోహ్లీ.. కెప్టెన్ రోహిత్ రియాక్షన్ చూశారా?
Virat Kohli, Rohit Sharma
Follow us
Basha Shek

|

Updated on: Jun 21, 2024 | 1:45 PM

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా గురువారం భారత్‌, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సూపర్‌ 8 మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 47 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 53 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలాగే హార్ధిక్‌ పాండ్యా కూడా 32 పరుగులతో రాణించాడు. చివర్లో ఓవర్లో అక్షర్‌ పటేల్‌ 12 పరుగులు చేసి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. ఇక 182 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆఫ్ఘాన్‌ 20 ఓవర్లలో 134 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 26 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్‌ బుమ్రా చెరో మూడు వికెట్లు పడగొట్టి భారత్ కు విజయాన్ని అందించారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ లాంటి బెస్ట్‌ ఫీల్డర్‌ క్యాచ్‌ వదిలేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బ్యాటింగ్‌లో పరుగులు‌ చేయలేక సతమతమవుతోన్న కోహ్లీ.. ఇలా ఫీల్డింగ్‌లోనూ చెత్త ప్రదర్శన కనబరుస్తుండటం క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేసినప్పుడు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఇచ్చిన రియాక్షన్‌ కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వళితే అర్ష్ దీప్‌ సింగ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌ నాలుగో బంతికి.. ఆఫ్ఘనిస్థాన్‌ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్‌ బ్యాక్‌వర్డ్ పాయింట్‌ దిశగా షాట్‌ ఆడాడు. అయితే.. అది డైరెక్టుగా కింగ్ కోహ్లీ చేతుల్లోకి వెళ్లింది. అంతర్జాతీయ క్రికెట్ లో బెస్ట్‌ ఫీల్డర్స్‌లో ఒకడైన కోహ్లీ చేతుల్లోకి వెళ్లింది కాబట్టి.. అందరూ టీమిండియాకు మరో వికెట్‌ దక్కింది అనుకున్నారు. కానీ, బంతి ఎంత వేగంగా కోహ్లీ చేతుల్లోకి దూసుకెళ్లిందో.. అంతే వేగంగా చేతులకి తగిలి కిందకు పడిపోయింది. కోహ్లీ కూడా షాక్‌లోకి వెళ్లిపోయాడు. విరాట్ కోహ్లీ క్యాచ్‌ వదిలిపెట్టడాన్ని నమ్మలేకపోయిన రోహిత్‌ శర్మ.. రెండు చేతులు తలపై పెట్టుకుని.. బిక్క చూపులు చూస్తూ ఉండిపోయాడు. కోహ్లీ క్యాచ్‌ వదిలిన వీడియోతో పాటు రోహిత్‌ శర్మ ఇచ్చిన రియాక్షన్‌ వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

కోహ్లీ క్యాచ్ డ్రాప్.. రోహిత్ రియాక్షన్ ఇదిగో..

ఫుల్ మ్యాచ్ హైలెట్స్ ఇదిగో..

View this post on Instagram

A post shared by ICC (@icc)

ఇరుజట్ల ప్లేయింగ్ 11..

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫరూజ్కాల్హాక్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్