OTT Movie: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ జానర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. మరీ ముఖ్యంగా హార్రర్ సినిమాలకు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లపై రికార్డు వ్యూస్ వస్తుంటాయి. అలా మరికొన్ని గంటల్లో ఒక సూపర్ హిట్ హారర్ మూవీ ఓటీటీలోకి రానుంది. ఇది కేవలం హారరే కాదు కడుపుబ్బా నవ్వించే సినిమా కూడా ..
ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ జానర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. మరీ ముఖ్యంగా హార్రర్ సినిమాలకు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లపై రికార్డు వ్యూస్ వస్తుంటాయి. అలా మరికొన్ని గంటల్లో ఒక సూపర్ హిట్ హారర్ మూవీ ఓటీటీలోకి రానుంది. ఇది కేవలం హారరే కాదు కడుపుబ్బా నవ్వించే సినిమా కూడా. అదే రాశీ ఖన్నా, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన అరణ్మైనై 4. తమిళంలో ఈ కామెడీ ఫ్రాంచైజీ సిరీస్ సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు రిలీజైన మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అరణ్మనై 4 పేరుతో కొద్ది రోజుల క్రితమే మరొక సినిమా వచ్చింది. తెలుగులో ఈ సినిమాను బాకుగా రిలీజ్ చేశారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. గత నెల మే 3న థియేటర్లలో రిలీజైన అరణ్మనై 4 పాజిటివ్ టాక ను సొంతం చేసుకుంది. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాదిలో రూ. 100 కోట్లు కొట్టిన తొలి తమిళ చిత్రం ఇదే కావడం విశేషం. తెలుగులోనూ బాకు సినిమాకు గట్టిగానే ప్రమోషన్లు నిర్వహించారు. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ కూడా ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టింది. ఇలా థియేటర్లలో ఆడియెన్స్ ను నవ్వంచి, భయ పెట్టిన అరణ్మనై-4 ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
అరణ్మనై -4 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది ఈ మేరకు జూన్ 21 నుంచి అరణ్మనై-4 చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఈ కామెడీ హారర్ మూవీ స్ట్రీమింగ్ కు రానుందన్న మాట. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అరణ్మనై సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ఇది వరకే డిస్నీప్లస్ హాట్ స్టార ప్రకటించింది.
ARANMANAI-4 is arriving on Disney+ Hotstar in 3 days! 🎉 Get ready for the excitement! 🍿 #Aranmanai4 | #DisneyPlusHotstar pic.twitter.com/FqGHmpDJq6
— ARANMANAI-4 FANS CLUB 👻 (@Aranmanai4) June 18, 2024
అరణ్మనై 4 సినిమాకు ప్రముఖ నటి ఖుష్బూ భర్త సుందర్ దర్శకత్వం వహించాడు. రాశీఖన్నా, తమన్నాలతో పాటు కేజీఎఫ్ రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్, కోవై సరళ, యోగిబాబు, ఢిల్లీ గణేశ్, జయప్రకాశ్, ఫ్రెడ్రిక్ జాన్సన్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. అన్వి సినీమ్యాక్స్, బెంజ్ మీడియా బ్యానర్లపై ఖుష్బూ సుందర్, అరుణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. హిప్‍హాప్ తమిజా స్వరాలు సమకూర్చారు. ఇక ఇందులోని అచ్చో అచ్చచ్చో అనే ప్రమోషనల్ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటికీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. సంగీత ప్రియులను తెగ అలరిస్తూ యూట్యూబ్ రికార్డులను కొల్లగొడుతోంది. మరి థియేటర్లలో అరణ్మనై 4 సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి..
விரைவில் 🔥
Aranmanai 4 Coming Soon On Disney + Hotstar#Aranmanai4 #ComingSoon #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/DsYnNrZ3d2
— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 2, 2024
Code Word Accepted 😉
Aranmanai 4 Coming soon On Disney + Hotstar #Aranmanai4 #ComingSoon #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/a6iZnBNZv1
— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.