Janhvi Kapoor : కాలి నడకన తిరుమలకు జాన్వీ కపూర్.. పుట్టినరోజున శ్రీవారి దర్శనం..
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల చేరుకున్నారు. శుక్రవారం (మార్చి 6న) ఆమె బర్త్ డే కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అలిపిరి నడకదారిలో నడుచుకుంటూ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల కొండపైకి చేరుకున్నారు. జాన్వీ కపూర్‌తో పాటు నటి మహేశ్వరి రేపు స్వామివారిని దర్శించుకోనున్నారు.
ప్రముఖ దివంగత నటి శ్రీదేవి కూతురు హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల చేరుకున్నారు. అలిపిరి నుంచి మెట్ల మార్గంలో తిరుమలకు వచ్చిన జాన్వీ రిలయన్స్ కు చెందిన రాధేయం గెస్ట్ హౌస్ లో బస చేశారు. ఈ రోజు పుట్టిన రోజు కావడంతో జాన్వీ విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. తన పిన్ని నటి మహేశ్వరితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన జాన్వీ తిరుమల చేరు కోగా నడకదారి భక్తులు ఆమెను చూసేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. ఇప్పుడు రామ్ చరణ్ జోడిగా పెద్ది చిత్రంలో నటిస్తుంది.ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అలాగే దేవర 2 చిత్రంలోనూ కనిపించనుంది. మరోవైపు అటు హిందీలోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది.
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..

