Bullet Trains: బుల్లెట్ రైళ్లపై కేంద్రం అదిరిపోయే అప్డేట్.. ఆ ఏడాది నుంచే పరుగులు.. ముహూర్తం ఫిక్స్
బుల్లెట్ రైళ్లపై మరో అప్డేట్ వచ్చింది. ఎప్పటికీ పూర్తవుతాయనే దానిపై రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. దేశంలో మొత్తం 7 హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లను నిర్మించనుండగా.. ఇవి 4 వేల కిలోమీటర్ల విస్తీరణంలో ఉండనున్నాయి. పూర్తి వివరాలు ఇలా..

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏడు హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్ల నిర్మాణానికి వడివిడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అలైన్‌మెంట్, డీపీఆర్, భూసేకరణపై దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి పలు రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది. వీలైనంత త్వరగా నిర్మాణం మొదలుపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. తాజాగా బుల్లెట్ రైళ్లకు సంబంధించి రోడ్ మ్యాప్‌ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. 4 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ 7 హైస్పీడ్ రైలు కారిడార్లు ఉండనుండగా.. ఇందుకోసం రూ.16 లక్షల కోట్లు ఖర్చు పెట్టనున్నారు. రాబోయే 10 ఏళ్లల్లో ఈ కారిడార్లను పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. కారిడార్ల నిర్మాణం పూర్తైతే బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు.
2040 నాటికి పూర్తి
2039-40 నాటికి హైస్పీడ్ రైలు కారిడార్లను పూర్తి చేయనున్నట్లు అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఆర్ధిక వృద్దిని నిలబెట్టుకోవడం, బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, సరుకు రావాణాకు ఈ రైళ్లు ఉపయోగపడతాయన్నారు. ఏడాదికి 500 కిలోమీటర్ల హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లను నిర్మించాలని రైల్వేశాఖ టార్గెట్ పెట్టుకుంది. అప్పడే 2040 నాటికి లక్ష్యాన్ని చేరుకోవచ్చని భావిస్తోంది. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సమానమైన కారిడార్‌ను నిర్మించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇప్పటికే బడ్జెట్లో ఆమోదించిన హైస్పీడ్ రైలు ప్రాజెక్టుతో పాటు మరో 3 వేల కిలోమీటర్ల కారిడార్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. 2040 నాటికి మొత్తం 7 వేల కిలోమీటర్ల బుల్లెట్ రైలు కారిడార్లను నిర్మించనున్నారు. ఆ తర్వాత 15 వేల నుంచి 21 వేల కిలోమీటర్ల కారిడార్ల నిర్మాణానికి అడుగులు వేయనున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
గంటకు 320 కిలోమీటర్ల వేగం
ఢిల్లీ-వారణాసి, ముంబై-పుణె, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-పుణె, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, వారణాసి-సిలిగిరి మధ్య తొలి దశ బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కారిడార్లను నిర్మించనున్నారు. వీట వల్ల ప్రయాణం సమయం తగ్గనుంది. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ఈ బుల్లెట్ రైళ్లు ప్రయాణిస్తాయి. ముంబై-అహ్మదాబాద్ మధ్య మొదటి బుల్లెట్ రైలు రానుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య కేవలం 2 గంటల 7 నిమిషాల్లోనే ప్రయాణం చేయవచ్చు. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో కొత్త పరిశ్రమలు ఏర్పడటం వల్ల ఆర్దికంగా రాష్ట్రాలు బలోపేతం అవుతాయి. దీని వల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మరో 10 ఏళ్లల్లో రాష్ట్రాల రూపురేఖలు ఈ బుల్లెట్ రైళ్ల రాకతో మారిపోతాయి. అటు విజయవాడ-విశాఖపట్నం మధ్య కూడా బుల్లెట్ రైలు కారిడార్‌ను రైల్వేశాఖ ఇటీవల ప్రతిపాదించింది. దీని వల్ల రాజధాని అమరావతిక రైల్వే కనెక్టివిటీ పెరగనుంది.
