AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Vedhika: యక్షణిగా విశ్వరూపం చూపించిన వేదిక.. మేకప్ కోసం ఎంత కష్టపడిందో తెలుసా..?

మనిషి రూపంలో ఉంటూ తన శాపనికి విరుగుడు కోసం ప్రయత్నిస్తున్న అమ్మాయి మాయ పాత్రలో యక్షిణి తన నట విశ్వరూపం చూపించిందనే చెప్పాలి. చాలా కాలం గ్యాప్ తర్వాత యక్షిణి సిరీస్ ద్వారా అడియన్స్ ముందుకు వచ్చిన వేదిక.. ఈసారి తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా వేదిక తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

Actress Vedhika: యక్షణిగా విశ్వరూపం చూపించిన వేదిక.. మేకప్ కోసం ఎంత కష్టపడిందో తెలుసా..?
Vedhika
Rajitha Chanti
|

Updated on: Jun 21, 2024 | 7:25 AM

Share

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్‏పై విజయవంతంగా దూసుకుపోతున్న వెబ్ సిరీస్‏లలో యక్షిణి ఒకటి. స్ట్రీమింగ్ కంటే ముందే ట్రైలర్, టీజర్ ద్వారా క్యూరియాసిటీని కలిగించింది. మంచు లక్ష్మి, హీరోయిన్ వేదిక కలిసి నటించిన ఈ సిరీస్ పై పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అడియన్స్. కంటెంట్, అలాగే ఇందులోని పాత్రలు గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో యక్షిణి పాత్రలో నటించిన వేదిక యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మనిషి రూపంలో ఉంటూ తన శాపనికి విరుగుడు కోసం ప్రయత్నిస్తున్న అమ్మాయి మాయ పాత్రలో యక్షిణి తన నట విశ్వరూపం చూపించిందనే చెప్పాలి. చాలా కాలం గ్యాప్ తర్వాత యక్షిణి సిరీస్ ద్వారా అడియన్స్ ముందుకు వచ్చిన వేదిక.. ఈసారి తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా వేదిక తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

యక్షిణి సిరీస్ కోసం వేదిక పడిన కష్టం చూసి షాకవుతున్నారు. కేవలం మేకప్ కోసమే దాదాపు 5 గంటలు వెచ్చించడం చూసి.. వేదిక డెడికేషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. యక్షిణిగా మారేందుకు మేకప్ వేయడానికి మూడు గంటలు పట్టేదట. అలాగే ఆ మేకప్ తీయడానికి రెండు గంటలు పట్టేదట. అంటే మొత్తం యక్షిణి లుక్ కోసమే ఐదు గంటలు తీసుకునేవారని.. అంతగా మేకప్ చేయడానికి టీం ఎంతో కష్టపడిందని చెబుతూ ఓ వీడియో షేర్ చేసింది. వేదిక కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం లభించిందని.. ఓటీటీలో యక్షిణి వెబ్ సిరీస్ కు దూసుకుపోతుందని అంటున్నారు నెటిజన్స్.

తేజ మర్ని దర్శకత్వం వహించిన ఈ యక్షిణి వెబ్ సిరీస్ లో యక్షిణిగా వేదిక, జ్వాలాముఖిగా మంచు లక్ష్మి, అజయ్, రాహుల్ విజయ్ కనిపించారు. తేజ మర్ని ఇంతకు ముందు అర్జున ఫల్గుణ, జోహార్, కోట బొమ్మాలి పీఎస్ వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఈ సిరీస్ జూన్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

View this post on Instagram

A post shared by Vedhika (@vedhika4u)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..