AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లులను కాపాడటానికి స్పెషల్ ప్లాన్..! సముద్ర తీరంలో ఫ్రీ స్టే, బ్రేక్‌ఫాస్ట్‌, మరెన్నో ఆఫర్లు

నీలిరంగు ఏజియన్ సముద్రం నుంచి వచ్చే చల్లని గాలి, తెల్లటి రంగు పూసిన అందమైన ఇళ్లు.. ఈ వాతావరణం చూస్తుంటే ఏదో సినిమాలో సీన్ లా అనిపిస్తుంది కదూ! గ్రీస్ వెళ్లడం అంటే లక్షలతో కూడిన ఖర్చు అని అందరూ భయపడతారు.

పిల్లులను కాపాడటానికి స్పెషల్ ప్లాన్..! సముద్ర తీరంలో ఫ్రీ స్టే, బ్రేక్‌ఫాస్ట్‌, మరెన్నో ఆఫర్లు
Free Stay
Nikhil
|

Updated on: Feb 14, 2026 | 10:16 PM

Share

టూరిస్టుల రద్దీ తక్కువగా ఉండే ‘సిరోస్’ అనే దీవి మాత్రం మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తోంది. అక్కడ మీరు ఉచితంగా ఉండటమే కాకుండా, ప్రకృతిని ఆస్వాదిస్తూ పిల్లులతో కాలక్షేపం చేయవచ్చు. వేల సంఖ్యలో ఉన్న పిల్లుల బాగోగులు చూసుకుంటే చాలు.. మీ వసతి, ఆహార బాధ్యతలను అక్కడ ఒక సంస్థ చూసుకుంటుంది. పిల్లుల మీద ప్రేమతో పాటు విదేశాల్లో ఉచితంగా ఉండాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.

పిల్లుల సామ్రాజ్యం..

సిరోస్ దీవిలో జనాభా కంటే పిల్లుల సంఖ్యే ఎక్కువగా కనిపిస్తుంది. స్థానికుల లెక్కల ప్రకారం ఇక్కడ సుమారు 3,000 వీధి పిల్లులు ఉన్నాయి. వీటిని రక్షించడానికి, వాటికి ఆహారం అందించడానికి 1990వ దశకం నుంచే ‘సిరోస్ కాట్స్’ అనే వాలంటీర్ ప్రోగ్రామ్ నడుస్తోంది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లుల ప్రేమికులను ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ వాలంటీర్లుగా చేరిన వారికి ఉచిత వసతి, బ్రేక్ ఫాస్ట్, ఇతర సౌకర్యాలను కల్పిస్తారు. ఈ ప్రోగ్రామ్ లో చేరాలనుకునే వారు ఒంటరిగా గానీ లేదా జంటగా గానీ రావచ్చు. కనీసం ఒక నెల పాటు అక్కడ ఉండటానికి సిద్ధంగా ఉండాలి.

రోజుకు ఐదు గంటలు, వారానికి ఐదు రోజులు పిల్లుల కోసం కేటాయించాలి. పిల్లులకు ఆహారం పెట్టడం, వాటిని శుభ్రం చేయడం, అనారోగ్యంతో ఉన్న పిల్లులకు వైద్య సాయం అందించడంలో సాయపడటం. వాలంటీర్లకు ప్రైవేట్ బెడ్ రూమ్ ఇస్తారు. కిచెన్, బాత్‌రూమ్ మరియు సముద్రం కనిపించే అందమైన టెర్రస్ ను ఇతరులతో పంచుకోవాల్సి ఉంటుంది. గ్రీకు సంస్కృతిలో పిల్లులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పూర్వ కాలంలో ధాన్యపు గిడ్డంగులను ఎలుకల నుంచి కాపాడటానికి పిల్లులను పెంచేవారు. గ్రీకు పురాణాల ప్రకారం పిల్లులను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. కొందరు వీటిని వేట దేవత అయిన ‘ఆర్టెమిస్’ తో కూడా పోలుస్తారు. అందుకే సిరోస్ దీవిలో పిల్లులను హింసించడం కాకుండా, వాటికి గౌరవం ఇచ్చే సంప్రదాయం మొదలైంది.

నోమాడ్స్ కు స్వర్గం..

పిల్లులను చూసుకోవడం ఒక పక్క అయితే, మిగిలిన సమయంలో మీరు సిరోస్ దీవిలోని అద్భుతమైన బీచ్ లలో ఈత కొట్టవచ్చు. తక్కువ ఖర్చుతో కూడిన జీవనం, మర్యాద ఇచ్చే స్థానికులు, ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల ఆన్‌లైన్‌లో పని చేసుకునే డిజిటల్ నోమాడ్స్ కు ఇది సరైన చోటు. మీ ల్యాప్‌టాప్ ముందు కూర్చుని ఏజియన్ సముద్రాన్ని చూస్తూ పని చేసుకోవడం ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ ఆఫర్ గురించి తెలిసిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా పిల్లుల ప్రేమికులు ఎగబడ్డారు.

దీనివల్ల 2026 సంవత్సరానికి సంబంధించిన వాలంటీర్ స్లాట్స్ అన్నీ అప్పుడే భర్తీ అయిపోయాయి. అయితే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. 2027 సీజన్ కోసం దరఖాస్తులు ఈ ఏడాది అక్టోబర్ నుంచి మళ్ళీ ప్రారంభం కానున్నాయి. కాబట్టి గ్రీస్ లో పిల్లులతో కలిసి ఫ్రీగా గడపాలంటే అప్పటివరకు వేచి చూడాల్సిందే. అందమైన ప్రదేశంలో నివసిస్తూ, నిస్సహాయ స్థితిలో ఉన్న మూగజీవాలకు సాయం చేయడం కంటే మంచి పని ఏముంటుంది? సిరోస్ దీవి ఇచ్చే ఈ అవకాశం కేవలం పర్యాటన మాత్రమే కాదు, ఒక గొప్ప సామాజిక బాధ్యత.

హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ