AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. ఆఫీస్‌లోకి వచ్చిన లాయర్‌ను నరికి చంపిన దుండగులు!

హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని అత్తాపూర్‌లో నివాసం ఉంటున్న ఓ లాయర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవల్లతో అతి దారుణంగా నరికి హత్య చేశారు. స్ఠానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తిచింది.

Hyderabad: హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. ఆఫీస్‌లోకి వచ్చిన లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
Attapur Lawyer Murder
Anand T
|

Updated on: Feb 14, 2026 | 10:40 PM

Share

పట్టపగలే ఓ లాయర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా వేటకొడవల్లతో దాడి చేసి హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్‌లో వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనతంరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగ రిత్యా న్యాయవాధిగా పనిచేస్తున్న ఖదీర్ అనే వ్యక్తి అత్తాపూర్‌లో నివాసం ఉంటూ.. సులేమాన్ నగర్‌లో తన సొంత ఆఫీస్‌ను నడుపుతున్నాడు. అయితే శుక్రవారం ఖదీర్ ఆఫీస్‌లో ఉన్న సమయంలో సడెన్‌గా లోపలికి వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. వేటకొడవల్లతో ఖదీర్‌పై దాడికి పాల్పడ్డారు. అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఇక నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఖదీర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ దారుణానికి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలే కారణమని.. ఖదీర్ దగ్గరి బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమింకంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు స్థానికంగా ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. వీలైనంత తొందర్లో నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
ఎంజీ నుంచి సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే
ఎంజీ నుంచి సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే