AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఒక్క రాంగ్ కాల్‌తో కొంపకొల్లేరు.. సినిమాను మించిన స్టోరీ.. ట్విస్టులు మామూలుగా లేవుగా..

ఒక రాంగ్ కాల్.. పదేళ్ల పచ్చని కాపురంలో నిప్పులు పోసింది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కడతేర్చేందుకు వేసిన మాస్టర్ ప్లాన్ ఊహించని మలుపు తిరిగింది. సినిమాకి మించిన ట్విస్టులతో నిండిన ఈ క్రైమ్ డ్రామా చిత్తూరు జిల్లా కుప్పంలో తీవ్ర కలకలం రేపింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Andhra Pradesh: ఒక్క రాంగ్ కాల్‌తో కొంపకొల్లేరు.. సినిమాను మించిన స్టోరీ.. ట్విస్టులు మామూలుగా లేవుగా..
Wife Hatches Plan With Lover To Kill Husband
Raju M P R
| Edited By: |

Updated on: Aug 01, 2026 | 8:45 AM

Share

ఒక్క రాంగ్ కాల్ ఒక పచ్చని సంసారంలో చిచ్చు రేపింది. పదేళ్ల బంధాన్ని, ఇద్దరు పిల్లల భవిష్యత్తును మరిచిపోయిన ఒక వివాహిత, రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన ప్రియుడి మోజులో పడి భర్తనే కడతేర్చడానికి పక్కా ప్లాన్ వేసింది. అయితే భర్త సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఈ కిలాడీ లేడీ ప్లాన్ తిరగబడింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వెలుగు చూసిన ఈ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. గుడుపల్లి మండలం గుడి కొత్తూరుకు చెందిన చిరంజీవికి, శాంతిపురం మండలం బియ్యం గొల్లపల్లికి చెందిన శోభతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఎంతో ఆనందంగా సాగుతున్న వీరి కాపురంలోకి మూడు నెలల క్రితం ఒక రాంగ్ కాల్ తుపానులా వచ్చింది. గుంటూరు జిల్లా కండ్రిగ గ్రామానికి చెందిన బాలాజీ నాయక్ అనే వ్యక్తితో రాంగ్ కాల్ ద్వారా శోభకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా అనైతిక సంబంధానికి దారితీసింది. ప్రియుడి మోజులో పడిన శోభ, నెల రోజుల క్రితం భర్త, పిల్లలను వదిలేసి బాలాజీ నాయక్‌తో కలిసి పారిపోయింది. భార్య అదృశ్యం కావడంపై చిరంజీవి గుడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.

హత్యకు పక్కా స్కెచ్

ఇదిలా ఉండగా, భర్త చిరంజీవిని అడ్డు తొలగించుకుంటేనే తాము ప్రశాంతంగా జీవించగలమని శోభ భావించింది. ఎలాగైన భర్తను చంపాలని మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల అన్నమయ్య జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఘటనను గుర్తుతెచ్చుకున్న చిరంజీవి.. అప్రమత్తమయ్యాడు. తన ప్రాణాలకు, పిల్లల భవిష్యత్తుకు ప్రమాదం ఉందని గ్రహించి.. సేఫ్ ‌జోన్‌లో ఉంటూనే భార్య ఆచూకీ కోసం గాలింపు చేపట్టాడు.

పెద్దల పంచాయితీలో బయటపడ్డ అసలు నిజం

ఈ క్రమంలో శోభ, బాలాజీ నాయక్ ఇద్దరూ బెంగిలపల్లిలో కాపురం పెట్టినట్లు చిరంజీవి గుర్తించాడు. కుప్పంలోని తిరుపతి గంగమ్మ గుడిలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకుని, బంధువులు, స్థానికుల సహాయంతో శోభ, బాలాజీలను పట్టుకున్నాడు. వారిని గ్రామంలోని గుడి వద్ద పెద్దల పంచాయితీ ముందు నిలబెట్టారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. పంచాయితీలో గ్రామ పెద్దలు వారిని విచారించగా అసలు దారుణం వెలుగులోకి వచ్చింది. శోభనే తనను ఇక్కడికి రప్పించి, భర్త చిరంజీవిని చంపేందుకు ప్లాన్ చేసిందని ప్రియుడు బాలాజీ నాయక్ అందరి ముందే ఒప్పుకోవడంతో శోభ నిర్వాకం విస్తుపోయేలా చేసింది.

పోలీసుల తీరుపై విమర్శలు

సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడుకున్న చిరంజీవి ఊపిరి పీల్చుకున్నాడు. కాగా ఈ ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి విచారణ చేపట్టారు. అయితే మొదట మిస్సింగ్ కేసును సీరియస్‌గా తీసుకోకపోవడం, ఆ తర్వాత ఆచూకీ దొరికినా గుడుపల్లి పోలీసులు సరైన రీతిలో స్పందించకపోవడంపై స్థానికులు, పెద్దల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us
AI లవ్‌.. మనిషికి కొత్త తోడు దొరికినట్టేనా?
AI లవ్‌.. మనిషికి కొత్త తోడు దొరికినట్టేనా?
ట్రాఫిక్ రద్దీకి చెక్..త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు..
ట్రాఫిక్ రద్దీకి చెక్..త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు..
సాగు భూమిలో భారీ విద్యుత్ టవర్లు.. రైతుకు నష్టపరిహారం వస్తుందా?
సాగు భూమిలో భారీ విద్యుత్ టవర్లు.. రైతుకు నష్టపరిహారం వస్తుందా?
చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!
చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు
మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు
జ్యోతిష్య ప్రకారం ఈ 4 రాశుల మహిళలు భర్తకు ఎప్పుడూ అండగా ఉంటారట!
జ్యోతిష్య ప్రకారం ఈ 4 రాశుల మహిళలు భర్తకు ఎప్పుడూ అండగా ఉంటారట!
20 ఏళ్ల Home Loan 12 ఏళ్లలో ఎలా తీర్చాలి? ఈ ట్రిక్స్‌ పాటిస్తే..
20 ఏళ్ల Home Loan 12 ఏళ్లలో ఎలా తీర్చాలి? ఈ ట్రిక్స్‌ పాటిస్తే..
దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే
దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే
పూజలో దేవుడి ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి?
పూజలో దేవుడి ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి?
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
టాలీవుడ్‌లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్‌ చర్యలు
టాలీవుడ్‌లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్‌ చర్యలు