AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుబాయ్‌లో బంధువులే శత్రువులయ్యారా..? కొడుకు కోసం తల్లిదండ్రుల కన్నీటి పోరాటం!

మంచి భవిష్యత్తు కోసం ఎడారి దేశానికి వెళ్లిన ఓ హైదరాబాదీ కుటుంబం... ఇప్పుడు తమ సొంత బిడ్డ కోసం కోర్టులు, పోలీస్ స్టేషన్లు, జైలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. కొడుకును తిరిగి పొందాలనే తల్లిదండ్రుల పోరాటం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఆ దంపతులకు స్వంత బంధువుల నుంచే తీవ్ర అన్యాయం ఎదురైంది. ప్రస్తుతం తండ్రి దుబాయ్ జైలులో, తల్లి భారత్‌లో ఉంటూ తమ కుమారుడి కోసం, భర్త విడుదల కోసం విదేశాంగ శాఖ సాయాన్ని కోరుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

దుబాయ్‌లో బంధువులే శత్రువులయ్యారా..? కొడుకు కోసం తల్లిదండ్రుల కన్నీటి పోరాటం!
Dubai Family Dispute
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Aug 01, 2026 | 9:29 AM

Share

మంచి భవిష్యత్తు కోసం ఎడారి దేశానికి వెళ్లిన ఒక కుటుంబం, ఇప్పుడు తమ సొంత బిడ్డ కోసం కోర్టులు, పోలీస్ స్టేషన్లు, జైలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. కొడుకును తిరిగి పొందాలనే తల్లిదండ్రుల పోరాటం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. హైదరాబాద్ పాతబస్తీ ఈద్‌బజార్‌కు చెందిన మహమ్మద్ జావిద్, ఐషా బేగం దంపతులు కోవిడ్‌కు ముందు ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లారు. జావిద్ డ్రైవర్‌గా ఉద్యోగం చేయగా, ఐషా బేగంకు కూడా అక్కడే పని దొరికింది. ఉద్యోగాలకు వెళ్లే సమయంలో చిన్న కుమారుడిని జావిద్ చెల్లి మహమ్మదీ బేగం వద్ద వదిలి వెళ్లేవారు.

మొదట్లో చిన్నారిని ఎంతో ప్రేమగా చూసుకున్న మహమ్మదీ బేగం… కొంతకాలానికి ఆ బిడ్డను పూర్తిగా తన దగ్గరే ఉంచాలని అన్న, వదినపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే తమ కుమారుడిని ఇవ్వడానికి జావిద్, ఐషా బేగం అంగీకరించలేదు. అప్పటి నుంచే కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయని చెప్తుంది ఐషా….ఆరు సంవత్సరాల పాటు దుబాయ్‌లో పనిచేసిన ఐషా బేగం వీసా గడువు ముగియడంతో భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. అయితే, ఆ తర్వాత తమ కుమారుడిని కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక దుబాయ్ కోర్టును ఆశ్రయించిన దంపతులు, తమ వాదనలు వినిపించారు. సుదీర్ఘ విచారణ అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకే అప్పగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు అయిషా చెప్తుంది

కోర్టు తీర్పు వచ్చిన తర్వాత జావిద్ తన చెల్లి ఇంటికి వెళ్లి కుమారుడిని అప్పగించాలని కోరగా… అక్కడ తీవ్ర వాగ్వాదం జరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అనంతరం మహమ్మదీ బేగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జావిద్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు కంటతడితో వివరిస్తుంది ఐషా. ఒకవైపు దుబాయ్ జైలులో తండ్రి… మరోవైపు భారత్‌లో తల్లి… ఇద్దరూ ఒకే ఆశతో బతుకుతున్నారు. తమ కుమారుడిని తిరిగి కౌగిలించుకోవాలనే ఆశతో న్యాయం కోసం పోరాడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో ఐషా బేగం కేంద్ర విదేశాంగ మంత్రికి లేఖ రాసి, తన భర్తను విడుదల చేయడంతో పాటు తన కుమారుడిని సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని వేడుకుంటున్నారు. ఈ కుటుంబం చేస్తున్న ఆరోపణలపై మరోవైపు మహమ్మదీ బేగం స్పందన ఏమిటి? దుబాయ్ అధికారుల వైఖరి ఏంటి? కేంద్ర విదేశాంగ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us