AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోదావరిలో వింత ఘటన.. చేపల కోసం గేలం వేస్తే వెన్నులో వణుకు పుట్టించే సీన్‌..!

చేపల కోసం గోదావరిలో గేలాలు వేసిన ఓ యువకుడికి ఊహించని అనుభవం ఎదురైంది. గేలాలను బయటకు లాగుతుండగా చేపకు బదులుగా సుమారు 5 కిలోల బరువున్న వింత ఆకారం చిక్కింది. భయంతో వణికిపోయిన యువకుడు ఆ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, దాన్ని గేలాలతో సహా తిరిగి నదిలోకి వదిలేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం తూరూబాక గ్రామ శివారులో చోటుచేసుకుంది..

గోదావరిలో వింత ఘటన.. చేపల కోసం గేలం వేస్తే వెన్నులో వణుకు పుట్టించే సీన్‌..!
Crocodile Gets Caught In Godavari
Srilakshmi C
|

Updated on: Oct 05, 2026 | 6:32 AM

Share

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 5: చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడికి ఊహించని అనుభవం ఎదురైంది. చేపల కోసం వేసిన గేలానికి ఏకంగా మొసలి పిల్ల చిక్కడంతో అతడు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం తూరూబాక గ్రామ శివారులో చోటుచేసుకుంది.

శనివారం రాత్రి గోదావరి నది తీరానికి వెళ్లిన యువకుడు చేపలు పడతాయనే ఆశతో గేలాలు వేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటలకే నది వద్దకు చేరుకుని గేలాలకు చేపలు చిక్కి ఉంటాయని భావించాడు. అయితే గేలాలను బయటకు లాగుతుండగా అతడికి ఊహించని దృశ్యం కనిపించింది. గేలానికి ఓ మొసలి పిల్ల చిక్కుకుని కదులుతూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అది చూసిన యువకుడికి ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది. కొద్దిసేపటి తర్వాత భయం నుంచి తేరుకున్న అతడు, ఈ దృశ్యాన్ని తన సెల్‌ఫోన్‌లో వీడియోగా చిత్రీకరించాడు.

ఇవి కూడా చదవండి

అనంతరం మొసలి పిల్లకు ఎలాంటి హాని కలగకుండా గేలాలతో సహా దాన్ని తిరిగి గోదావరి నదిలోకి వదిలేశాడు. దీంతో ఊపిరి పీల్చుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. స్థానికుల అంచనా ప్రకారం ఆ మొసలి పిల్ల సుమారు 5 కిలోల బరువు, దాదాపు 2 అడుగుల పొడవు ఉండొచ్చని తెలుస్తోంది. చేపల కోసం వేసిన గేలానికి మొసలి పిల్ల చిక్కడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు

భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్

అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?

దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?

వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!

అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా

న్యూజిలాండ్ గడ్డపై హిట్‌మ్యాన్ చరిత్ర తిరగరాస్తాడా?

కరువులోనూ కాసుల వర్షం.. ఉల్లి సాగుతో ఏకంగా కోటి సంపాదించిన రైతు..

వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే

టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు

పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!

చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..

జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి

దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం

పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!

ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?