ఏంటి సుధా ఈవిడ.! అందంలో కుర్ర హీరోయిన్స్ ను బీట్ చేస్తుందిగా..!!

Rajeev 

Pic credit - Instagram

14 February 2026

ప్రియమణి.. 18 ఏళ్ల వయసులోనే నటిగా సినీప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. 2003లో ఎవరే అతగాడు సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత 2007లో తమిళ చిత్రం పరుత్తివీరన్‌లో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది.

ఇక మణిరత్నం దర్శకత్వం వహించిన రావణ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు.

 కొన్నాళ్లు తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిన ప్రియమణి 2013లో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో కనిపించింది.

ఇందులో షారుఖ్ ఖాన్ తో కలిసి 1234 అనే స్పెషల్ సాంగ్ తో ఇరగదీసింది. అప్పట్లో ఈ సాంగ్ సెన్సేషన్ అయ్యింది.

ఆ తర్వాత ది ఫ్యామిలీ మ్యాన్, ఆర్టికల్ 370 వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.

పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తుంది.