ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డు కౌన్సిలర్‌గా బజ్జీ బండి నడుపుకునే గుబిడె నాగుబాయి గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి 58 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజకీయ నేపథ్యం లేని సామాన్యులు కూడా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించవచ్చని నాగుబాయి నిరూపించారు. ఆమె స్థానిక ప్రజలతో కలిసిమెలిసి ఉండేవారు.