AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Mouli OTT: అఫీషియల్.. ఆహా ఓటీటీలో నవదీప్ బోల్డ్ మూవీ.. లవ్ మౌళి స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

చాలా కాలం తర్వాత టాలీవుడ్‌ యాక్టర్ నవదీప్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం లవ్ మౌళి. దర్శక ధీరుడు రాజమౌళి శిష్యుడు అవ‌నీంద్ర తెరకెక్కించిన ఈ బోల్డ్ లవ్ స్టోరీలో పంఖురి గిద్వాని హీరోయిన్ గా నటించింది. ఛార్వీ దత్తా మరో ఫీమేల్ లీడ్ లో కనిపించింది. భళ్లాల దేవ రానా దగ్గుబాటి అతిథి పాత్రలో మెరిశాడు.

Love Mouli OTT: అఫీషియల్.. ఆహా ఓటీటీలో నవదీప్ బోల్డ్ మూవీ.. లవ్ మౌళి స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Love Mouli Movie
Basha Shek
|

Updated on: Jun 21, 2024 | 8:07 AM

Share

చాలా కాలం తర్వాత టాలీవుడ్‌ యాక్టర్ నవదీప్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం లవ్ మౌళి. దర్శక ధీరుడు రాజమౌళి శిష్యుడు అవ‌నీంద్ర తెరకెక్కించిన ఈ బోల్డ్ లవ్ స్టోరీలో పంఖురి గిద్వాని హీరోయిన్ గా నటించింది. ఛార్వీ దత్తా మరో ఫీమేల్ లీడ్ లో కనిపించింది. భళ్లాల దేవ రానా దగ్గుబాటి అతిథి పాత్రలో మెరిశాడు. పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ తోనే లవ్ మౌళి సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు నవదీప్ గెటప్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రమోషన్లు కూడా గట్టిగా నిర్వహించారు. అందుకు తగ్గట్టుగానే జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ మౌళి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నవదీప్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా చూసినవారంతా నవదీప్ కొత్తగా కనిపించాడు, లుక్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది అని పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. అయితే కొన్ని కారణాలతో లవ్ మౌళి సినిమా లాంగ్ రన్ లో ఆడలేకపోయింది. దీంతో అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైందీ నవ దీప్ సినిమా. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లవ్ మౌళి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నవదీప్ సినిమా స్ట్రీమింగ్ గురించి అప్ డేట్ ఇచ్చారు ఆహా మేకర్స్.

త్వరలోనే ఆహా ఓటీటీలో ‘లవ్ మౌళి’ స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు మేకర్స్. సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ ను షేర్ చేస్తూ.. ‘తను ప్రేమ గురించి మిమ్మల్ని గట్టిగా ఆలోచించేలా చేస్తాడు. త్వరలోనే ఆహాలో లవ్ మౌళి జర్నీని ఎక్స్‌పీరియన్స్ చేయండి’ అని క్యాప్షన్ ఇచ్చింది ఆహా. అయితే స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడనే విషయాన్ని మాత్రం ఇంకా ఫైనలైజ్ చేయలేదు. త్వరలోనే అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్, సి స్పేస్ సంయుక్తంగా లవ్ మౌళి సినిమాను తెరకెక్కించారు. గోవింద్ వసంత ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో లవ్ మౌళి సినిమాను మిస్ అయ్యారా? అయితే కొద్ది రోజులు వెయిట్ చేయండి. త్వరలోనే ఆహా ఓటీటీలోకి రానుంది. ఎంచెక్కా ఇంట్లోనే నవ్ దీప్ ప్రేమకథను చూసేయండి.

ఇవి కూడా చదవండి

త్వరలోనే స్ట్రీమింగ్..

లవ్ మౌళి  ట్రైలర్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..