Pawan Kalyan: పవన్‌ను అమితంగా అభిమానించే స్రవంతి.. తన కుమారుడికి ఏం పేరు పెట్టిందో తెలుసా? బోటిక్‌కు కూడా..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరుకు ఉండే స్థాయి, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ పేరు మార్మోగిపోతోంది. ఎన్డీఏ కూటమి విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకు తగ్గట్టుగానే ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు

Pawan Kalyan: పవన్‌ను అమితంగా అభిమానించే స్రవంతి.. తన కుమారుడికి ఏం పేరు పెట్టిందో తెలుసా? బోటిక్‌కు కూడా..
Pawan Kalyan, Sravanthi Chokarapu
Follow us

|

Updated on: Jun 20, 2024 | 11:22 AM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరుకు ఉండే స్థాయి, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ పేరు మార్మోగిపోతోంది. ఎన్డీఏ కూటమి విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకు తగ్గట్టుగానే ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో పవన్ కల్యాణ్ కు ఉన్న కోట్లాది మంది అభిమానులు ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు కూడా పవన్ విజయాన్ని స్వాగతిస్తున్నారు. ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా పవర్ స్టార్ పవన కల్యాణ్ ను అమితంగా ఆరాధించే టాలీవుడ్ సెలబ్రిటీల్లో ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు ఒకరు. ఎంతలా అంటే తన కుమారుడికి అకీరా నందన్ అని పేరు పెట్టేంత. అలాగే ఆమె రన్ చేస్తోన్న బోటిక్ పేరు కూడా పవన్ కళ్యాణ్ కుమారుడు పేరు వచ్చేట్టుగా అకీరా లేబిల్ అనే పేరు పెట్టింది స్రవంతి.

“నేను పవన్ కల్యాణ్‌కు మొదటి నుంచి చాలా పెద్ద అభిమానిని. అందుకే మా అబ్బాయికి పవన్ కుమారుడి పేరు అయిన అకీరా నందన్ అని పేరు పెట్టాను. ఇన నేను సొంతంగా నడిపే బోటిక్ పేరు కూడా అకీరా లేబిల్. నా బోటిక నుంచి పవన్ కల్యాణ్ కు కొన్ని అవుట్ ఫిట్స్ కూడా పంపించాను. అవి ఆయన వేసుకున్నారు కూడా. అందుకు నేను చాలా హ్యాఫీగ ఫీలయ్యాను’ అని స్రవంతి చెప్పుకొచ్చింది.

కుమారుడితో యాంకర్ స్రవంతి చొక్కారపు..

Sravanthi Chokarapu

Sravanthi Chokarapu (Credit: Sravanthi Chokarapu Instagram)

త్వరలోనే పవన్ ను కలుస్తాను..

ఇదిలా ఉంటే స్రవంతి ఇంతవరకు నేరుగా పవన్ కల్యాణ్ ని కలవలేదట. అయితే త్వరలోనే ఆయనను కలుస్తానని ధీమాగా చెబుతోందీ అందాల యాంకరమ్మ. ‘ పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా ప్రచార సభలు, ఎన్నికలు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా, మంత్రిగ బిజీ బిజీగా ఉంటున్నారు. వీటినుంచి ఆయనకు కాస్త తీరిక సమయం దొరికినప్పుడు కచ్చితంగా కలుస్తాను’ అని చెప్పుకొచ్చింది స్రవంతి. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసి మెగాభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో