Prabhas: డార్లింగ్ కామెడీ చూస్తే పొట్టచెక్కలే.. కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ కష్టాలు..
ఇంట్రోవర్ట్ ప్రభాస్ ఇది అందరికి తెలిసిన విషయమే. సినిమాల్లో కనిపించే హీరో.. బయట కనిపించే ప్రభాస్ ఇద్దరూ ఒక్కటే అంటే నమ్మడం కష్టమే. ఎందుకంటే డార్లింగ్ చాలా ఇంట్రోవర్ట్. బాహుబలి సినిమా నుంచి మూవీ ప్రమోషన్స్, ఈవెంట్లలో కాస్త మాట్లాడుతున్నాడు డార్లింగ్. ఇక తాజాగా జరిగిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్లో డార్లింగ్ పడిన కష్టాలు చూస్తే మీ పొట్టచెక్కలవ్వాల్సిందే.
బాక్సాఫీస్ కింగ్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా మూవీ లవర్స్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. ఈ మూవీలో డార్లింగ్ యాక్టింగ్, లుక్, స్టైల్ ప్రేక్షకులను ఫిదా చేశాయి. దీంతో డార్లింగ్ సినిమాల కోసం ఇప్పుడు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అలాగే ప్రభాస్ తో సినిమా తీసేందుకు సౌత్ టూ నార్త్ దర్శకనిర్మాతలు క్యూ కట్టారంటే డార్లింగ్ క్రేజ్ ఓ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. లవ్ స్టోరీస్ అయినా.. మాస్ యాక్షన్ అయినా ప్రభాస్ యాక్టింగ్ గురించి తెలిసిందే. కానీ బిగ్ స్క్రీన్ పై ప్రభాస్‌కు.. రియల్ లైఫ్ డార్లింగ్ కు చాలా డిఫరెంట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. బాహుబలి, సలార్ వంటి సినిమాల్లో నట విశ్వరూపం చూపించిన ప్రభాస్ బయట మాత్రం ఇంట్రోవర్టే.
ఇంట్రోవర్ట్ ప్రభాస్ ఇది అందరికి తెలిసిన విషయమే. సినిమాల్లో కనిపించే హీరో.. బయట కనిపించే ప్రభాస్ ఇద్దరూ ఒక్కటే అంటే నమ్మడం కష్టమే. ఎందుకంటే డార్లింగ్ చాలా ఇంట్రోవర్ట్. బాహుబలి సినిమా నుంచి మూవీ ప్రమోషన్స్, ఈవెంట్లలో కాస్త మాట్లాడుతున్నాడు డార్లింగ్. ఇక తాజాగా జరిగిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్లో డార్లింగ్ పడిన కష్టాలు చూస్తే మీ పొట్టచెక్కలవ్వాల్సిందే. స్టేజ్ పై మాట్లాడేందుకు.. నిలబడేందుకు చాలా ఇబ్బందులు పడ్డాడు. నిన్న ముంబైలో జరిగిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, ప్రభాస్ హాజరవ్వగా.. రానా దగ్గుబాటి హోస్ట్ గా వ్యవహరించారు. స్టేజ్ పై వీరందరిని కూర్చొబెట్టి తనదైన స్టైల్లో క్వశ్చన్స్ చేశాడు రానా. ఈ క్రమంలోనే స్టేజ్ పై ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. ప్రభాస్ మోహమాటం చూసి తెగ నవ్వుకుంటున్నారు ఫ్యాన్స్.
స్టేజ్ పై రానా ప్రశ్నలు అడుగుతున్న సమయంలో ఓ కుర్రాడు వచ్చి అందరికి మైక్స్ ఇస్తున్నాడు. ముందుగా దీపికాకు మైక్ ఇచ్చి ఆ తర్వాత ప్రభాస్ చేతిలో మైక్ పెట్టాడు. మైక్ తీసుకుంటూ డార్లింగ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూస్తే నవ్వాగదు. మైక్ పట్టుకుంటే మాట్లాడమంటారేమో అని వెంటనే పక్కనే ఉన్న దీపికాకు మైక్ ఇవ్వాలని చూశాడు. కానీ అప్పటికే దీపికా చేతిలో మైక్ ఉండిపోయింది. దీంతో మరో పక్కన ఉన్న కమల్ హాసన్ కు మైక్ ఇవ్వాలనుకున్నాడు. కానీ అప్పుడే కమల్ కు కూడా మైక్ ఇవ్వడంతో.. ఇక తప్పదు అన్నట్లు మైక్ చేతిలో పట్టుకుని కూర్చున్నాడు డార్లింగ్. అంతకు ముందు స్టేజ్ పై దీపికా పక్కన నిలబడిన ప్రభాస్.. అమితాబ్ మాట్లాడుతున్నప్పుడు తెగ సిగ్గుపడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తూ.. పాన్ ఇండియా స్టార్ అయినా.. ఎప్పటికీ డార్లింగ్ సాదాసీదానే.. స్టార్ డమ్ ఉన్నా సింపుల్ క్యారెక్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Pandagala Digivachavu🥺❤️ #Prabhas #KALKI2898AD pic.twitter.com/XMTABHpmvv
— Rᴀᴠɪ ᴠᴀ₹ᴍᴀ™ (@PrabhasVortex) June 20, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.