నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. యుద్ధం వల్ల దుబాయ్లో చిక్కుకుపోయిన ఏ దేశస్థులకైనా ఉచిత వసతి, భోజనం అందిస్తానని ప్రకటించారు. "నో నేషనాలిటీ, నో కండిషన్స్, జస్ట్ హ్యూమానిటీ" అంటూ ఇన్స్టాలో చేసిన ఈ ప్రకటన నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. సహాయం కావాల్సినవారు తన బృందాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించవచ్చు.