Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం.. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఏమన్నారో తెలుసా?
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. సీఎంగా చంద్ర బాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక టీడపీ, జనసేన, బీజేపీ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు బుధవారం (జూన్ 19) ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. సీఎంగా చంద్ర బాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక టీడపీ, జనసేన, బీజేపీ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు బుధవారం (జూన్ 19) ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గానే కాకుండా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల శాఖలను పవన్ కల్యాణ పర్యవేక్షించనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు జనసేన అధిపతికి శుభాకాంక్షలు, అభనందనలు తెలిపారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ రచయిత కోన వెంకట్ సోషల్ మీడియా ద్వారా పవన్ కల్యాణ్ కు విషెస్ చెప్పారు. దీంతో పాటు మెగా స్టార్ చిరంజీవికి కూడా అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు కోన వెంకట్.
‘ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మన ప్రియమైన పవన్ కల్యాణ్ కు ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు. ఇది ఆయన ఒక్క కల కాదు, ఆయన లక్షలాది మంది అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సామాన్యులు అలాగే ఆయన కుటుంబ సభ్యుల కల. ఈ స్థానానికి చేరుకోవడానికి ఆయన 15 సంవత్సరాలు కష్టపడ్డారు. కొన్ని సంవత్సరాల క్రితం కష్టమైన ప్రయాణాన్ని ప్రారంభించి, తన సోదరుడు దానిని విజయవంతంగా పూర్తి చేసిన గర్వించదగిన సోదరుడు పద్మ విభూషణ్ చిరంజీవి. ఈ ప్రత్యేక సందర్భంగా నేను ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను’ అని కోన వెంకట్ రాసుకొచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో మన ముందుకు వచ్చారు కోన వెంకట్. తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్ర పోషించిన ఈ హార్రర్ కామెడీ థ్రిల్లర్ యావరేజ్ గా నిలిచింది.
కోన వెంకట్ ట్వీట్ ఇదిగో..
Today is an Important day for our dear @PawanKalyan , who’s assuming office as the “Deputy Chief Minister “ of Andhra Pradesh 💪❤️ This is not his dream but the dream of Millions of his fans, friends, well wishers, common man and also his family !! He struggled 15 years to reach… pic.twitter.com/Yta3uk57fe
— KONA VENKAT (@konavenkat99) June 19, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.