AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breast Cancer: దేశంలో వేగంగా పెరుగుతున్న బ్రిస్ట్‌ క్యాన్సర్ కేసులు.. వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్! కారణాలు ఇవే!

ఈ మధ్య కాలంలో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. లాన్సెట్ ఆంకాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం 2050 నాటికి దేశంలో సుమారు 4.5 మిలియన్ల మంది మహిళలు ఈ క్యాన్సర్‌ను బారీన పడే అవకాశం ఉందని పేర్కొంది. కాబట్టి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుంది. ఈ కేసులు పెరగడానికి గల కారణాలేంటో, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Breast Cancer: దేశంలో వేగంగా పెరుగుతున్న బ్రిస్ట్‌ క్యాన్సర్ కేసులు.. వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్! కారణాలు ఇవే!
Breast Cancer
Anand T
|

Updated on: Mar 06, 2026 | 1:13 PM

Share

రోజురోజుకూ దేశంలోని మహిళలకు రొమ్ము క్యాన్సర్ ఒక పెద్ద ఆందోళనగా మారుతోంది. దేశంలో ఈ క్యాన్సర్ కేసులు శర వేగంగా పెరుగుతున్నాయి. రీసెంట్‌గా రిలీజైన ఓ అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం, గతంతో పోల్చుకుంటే గత మూడు దశాబ్దాలలో దేశ వ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కేవలం ఒకప్పుడు పెళ్లైన వారిలో మాత్రమే కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు యువతుల్లో కూడా కనిపిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ఈ కేసులు పెరుగుదల ఇలానే కొనసాగితే 2050 నాటికి దేశంలో సుమారు 4.5 మిలియన్ల మంది మహిళలు ఈ క్యాన్సర్‌ను బారీన పడే అవకాశాలు ఉన్నాయి.

ది లాన్సెట్ ఆంకాలజీలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. 1990లో, భారతదేశంలో ప్రతి 100,000 మంది మహిళల్లో 13 మంది రొమ్ము క్యాన్సర్ బారీన పడితే 2024 నాటికి, ఈ సంఖ్య ప్రతి 100,000 మంది మహిళలకు 29.4 కు పెరుగుతుంది, అంటే క్యాన్సర్ కేసులు రెట్టింపు కంటే ఎక్కువ అయ్యాయని తెలుస్తోంది.

యువతులలో కూడా కేసులు పెరుగుతున్నాయి

ఈ అధ్యయనం ప్రకారం, 2023 నాటికి 55 ఏళ్లు పైబడిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపించేవి. ఈ వయసులో ప్రతి లక్ష మంది మహిళలకు సుమారు 161 కేసులు నమోదైతే.. 1990 నుండి 20 మధ్య 54 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో క్యాన్సర్ కేసులు సుమారు 30 శాతం పెరిగాయని కూడా పరిశోధన వెల్లడించింది. ఈ గణాంకాలు 20 నుండి 54 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలను రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా ప్రభావితం చేస్తోందని సూచిస్తున్నాయి.

రోమ్ము క్యాన్సన్ వచ్చేందుకు కారణాలు

మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌కు ప్రధాన కారణాలను కూడా ఈ పరిశోధన సంస్థ వెల్లడించింది. సిగరెట్ ధూమపానం, రక్తంలో చక్కెర పెరుగుదల, ఊబకాయం, ఫాస్ట్ ఫుడ్ వినియోగం వంటి పేలవమైన ఆహారపు అలవాట్లు, ఎర్ర మాంసం అధికంగా తీసుకోవడం, జీవనశైలి సరిగా లేకపోవడం వంటి పొగాకు వినియోగం మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌కు ప్రధాన కారణాలని పరిశోధన పేర్కొంది. పరిశోధనలో పాల్గొన్న ఆంకాలజిస్ట్ డాక్టర్ దిను ఆల్ఫోర్డ్ ప్రకారం, ఈ కేసులు ఆందోళనలను పెంచుతున్నాయని అన్నారు. అందువల్ల, రొమ్ము క్యాన్సర్‌ను నివారించడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.

రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

  • 20 సంవత్సరాల వయస్సు తర్వాత మాత్రమే రొమ్ము క్యాన్సర్ పరీక్ష చేయించుకోండి.
  • రోజూ వ్యాయామం చేయండి
  • మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి
  • పొగాకు, మద్యానికి దూరంగా ఉండండి
  • ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోండి
  • సరైన నిద్రను మెయింటేన్ చేయండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us