AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwak Sen: ప్రభాస్ ‘కల్కి’ సినిమాపై నెగెటివ్ కామెంట్స్.. ఆ యూట్యూబర్‌ను చెడుగుడు ఆడుకున్న విశ్వక్ సేన్

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ గురించి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడడం అతని స్టైల్. ఏదైనా నచ్చకపోతే తన స్టైల్‌లోనే స్పందిస్తాడు. అలా కొన్ని సార్లు విశ్వక్ సేన్ చేసిన కామెంట్లు కాంట్రవర్సీలకు కూడా దారి తీశాయి. తాజాగా మరోసారి విరుచుకుపడ్డాడు విశ్వక్ సేన్.

Vishwak Sen: ప్రభాస్ 'కల్కి' సినిమాపై నెగెటివ్ కామెంట్స్.. ఆ యూట్యూబర్‌ను చెడుగుడు ఆడుకున్న విశ్వక్ సేన్
Prabhas, Vishwak Sen
Basha Shek
|

Updated on: Jun 19, 2024 | 10:01 AM

Share

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ గురించి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడడం అతని స్టైల్. ఏదైనా నచ్చకపోతే తన స్టైల్‌లోనే స్పందిస్తాడు. అలా కొన్ని సార్లు విశ్వక్ సేన్ చేసిన కామెంట్లు కాంట్రవర్సీలకు కూడా దారి తీశాయి. తాజాగా మరోసారి విరుచుకుపడ్డాడు విశ్వక్ సేన్. ప్రభాస్ నటించిన కల్కి సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేసిన ఓ యూబ్యూబర్ ను ఒక ఆటాడుకున్నాడు. ఈ మేరకు తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పోస్ట్ చేశాడీ ట్యాలెంటెడ్ హీరో. ‘సినిమాలు రిలీజ్ కూడా అవకముందే చెంబులు పట్టుకొని బయలుదేరుతున్నారు. యూట్యూబ్‍లో మీ ఆదాయం పెంచుకోవడం కోసం వేల కుటుంబాలు నడుస్తున్న సినిమా ఇండస్ట్రీతో మజాక్‍లు అయిపోయాయి మీకు. వీడు ఒక పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీస్తే చూద్దాం.. లేదంటే అడ్రస్ తప్పిపోయిన వాళ్లు అనుకుని ఇగ్నోర్ చేద్దాం.. ఇలా విమర్శలు చేసే వారంతా కూడా ఓ పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయండి. అప్పుడు మీకు, మీ ఒపీరియన్‍కు కాస్త గౌరవం ఉంటుంది. మన చుట్టూ ఉన్న కొంత మంది పైరసీ కంటే డేంజర్. సినిమా కోసం ఇక్కడ చిందించే రక్తం, చెమటను, ఎంతో మందికి జోవనోపాధిని ఇస్తున్న ఈ ఇండస్ట్రీని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇంతకీ యూబ్యూబర్ ఏమన్నాడంటే?

ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా ట్రైలర్ గురించి బార్‌బెల్ పిచ్ మీటింగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్‍లో ఓ యూట్యూబర్ వీడియో పోస్ట్ చేశాడు. ప్రభాస్ సినిమా ట్రైలర్‌పై తన అభిప్రాయాలను అతను తెలియజేశాడు. మ్యాడ్‍మ్యాక్స్, బ్యాట్‍మాన్ సహా కొన్ని హాలీవుడ్ సినిమాల నుంచి రిఫరెన్సులు తీసుకుని చేసినట్టుగా ఉందని అన్నాడు. అయితే ఈ నెగెటివ్ కామెంట్ల మీద విశ్వక్ సేన్ మండి పడ్డాడు. దమ్ముంటే ఓ 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీసి చూపించమని సవాల్ విసిరాడు.

ఇవి కూడా చదవండి

ఇక సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న కల్కి సినిమా జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లో గత రికార్డులను చెరిపేసిందీ మూవీ. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..