AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Sethupathi: విజయ్ సేతుపతి పాదాలకు నమస్కరించిన డైరెక్టర్.. కారణమేంటో తెలుసా? వీడియో

విజయ్ సేతుపతి హీరోగా నటించిన తాజా చిత్రం మహారాజ. నితిలన్ సామినాథన్ తెరకెక్కించిన మహారాజా సినిమాలో మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యపఫ్, అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషించారు.జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. తెలుగులోనూ ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి.

Vijay Sethupathi: విజయ్ సేతుపతి పాదాలకు నమస్కరించిన డైరెక్టర్.. కారణమేంటో తెలుసా? వీడియో
Vijay Sethupathi
Basha Shek
|

Updated on: Jun 18, 2024 | 11:42 AM

Share

చాలా రోజుల తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన తాజా చిత్రం మహారాజ. నితిలన్ సామినాథన్ తెరకెక్కించిన మహారాజా సినిమాలో మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యపఫ్, అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషించారు.జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. తెలుగులోనూ ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో మహారాజా చిత్ర బృందం సంతోషంలో మునిగి తేలుతోంది. సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ తమ సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. విజయ్ సేతుపతి కూడా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే ఆయనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఇందులో విజయ్ సేతుపతి నడుస్తూ వెళ్తుండగా.. ఇంతలో అక్కడికి దర్శకుడు బుచ్చిబాబు కనిపించడంతో ఆయన ఎంతో ప్రేమగా చిన్నా అని పలకరించారు. కానీ అంతలోనే దర్శకుడు బుచ్చిబాబు విజయ్ సేతుపతి పాదాలపై పడి నమస్కారం చేశాడు.

ఇవి కూడా చదవండి

దీంతో వెంటనే విజయ్ సేతుపతి, బుచ్చిబాబును పైకి లేపి అప్యాయంగా ఆయనను గుండెలకు హత్తుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా విజయ్ సేతుపతి, బుచ్చిబాబు కాంబినేషన్ లో వచ్చిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించినప్పటికీ విజయ్ సేతుపతి పాత్ర బాగా ఫేమస్ అయిపోయింది. దీంతో వీరిద్దరి మధ్య అనుబంధం పెరిగింది. ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి బుచ్చిబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఉప్పెన సినిమా బుచ్చి బాబు కోసమే చేశాను, ఆయనకు సినిమా మీద ఉన్న ఫ్యాషన్ ను చూసి నేను ఒప్పుకున్నాను. అందుకోసం చాలా తక్కువ రెమ్యునరేషన్ కు తీసుకున్నాను’ అని డైరెక్టర్ పై అభిమానం చాటుకున్నారు మక్కల్ సెల్వన్.

వీడియో ఇదిగో.,.

మహరాజా సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..